ముగిసిన గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. చితికి నిప్పు పెట్టిన సోదరుడు..

Lata Mangeshkar: అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు ముగిశాయి.

Update: 2022-02-06 14:14 GMT

ముగిసిన గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు.. చితికి నిప్పు పెట్టిన సోదరుడు..

Lata Mangeshkar: అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల కన్నీటి వీడ్కోలు మధ్య ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఆమె భౌతిక కాయానికి పలువురు అంతిమ నివాళులర్పించారు. గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన లత అంతిమ సంస్కారాలకు అభిమానులు, నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. సైనిక లాంఛనాలతో లతాజీ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలు పూర్తి అయ్యాక, లతా మంగేష్కర్ అంత్యక్రియల చితిపై ఆమె సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్ అగ్నిని వెలిగించారు.

Tags:    

Similar News