కార్తీక దీపం: రసకందాయంలో పడిన కథనం..నిజానికి దగ్గరగా వచ్చిన సౌర్య!

Update: 2020-01-29 09:28 GMT

టీవీ సీరియల్స్ లో సంచలనం సృష్టిస్తున్న కార్తీక దీపం సీరియల్ కథ ప్రస్తుతం మంచి ట్విస్ట్ లో పడింది. ఎప్పటికప్పుడు ఇక చివరికి వచ్చేసినట్టు అనిపించే కథనంతో 716 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని.. 717 ఎపిసోడ్ లోకి చేరుకుంది. అయినా, అదే తాజాతనం కార్తీక దీపం సీరియల్ లో ఇప్పటికీ కనిపిస్తోంది. అక్కడే టీవీ ప్రేక్షకులు ఈ సీరియల్ కి కనెక్ట్ అయిపోయారు.

ఇద్దరు భార్యాభర్తలు.. వారిని విడదీయాలని ప్రయత్నిస్తున్న ఒక యువతి.. కొడుకు చేస్తున్న పని తప్పనీ, కోడలని అమ్మలా ఆదరిస్తూ అండగా నిలబడిన అత్తగారు.. తల్లి దగ్గర ఒకరు.. తండ్రి దగ్గర ఒకరు పెరుగుతున్న పిల్లల మానసిక సంఘర్షణ.. ఇలా ఎన్నో చిక్కు ముడులను.. చిక్కగా అల్లుకుని పసందైన సీరియల్ గా నడిపిస్తున్నారు కార్తీక దీపం సీరియల్ ను.


డాక్టర్ కార్తీక్.. దీపల మధ్య కార్తీక్ మరదలు మౌనిత కారణంగా వచ్చిన స్పర్ధలతో విడి విడిగా జీవిస్తుంటారు. వారి పెద్ద కూతురు సౌర్య దీప దగ్గర..చిన్న కూతురు హిమ కార్తీక్ దగ్గర పెరుగుతుంటారు. ఈ ఇద్దరినీ కలపాలని కార్తీక్ తల్లి విశ్వ ప్రయత్నం చేస్తుంటుంది. ఇదిలా ఉంటే, అటు మౌనిత కూడా వారిద్దరూ దగ్గర కాకూడదని తన వంతు కుత్సిత ప్రయత్నాలు చేస్తుంది. ఇక మరోవైపు సౌర్య తన తండ్రి ఎవరో తెలుసుకోవలాని ప్రయత్నిస్తూ ఉంటుంది. కార్తీక్ దగ్గర ఉన్న హిమ మాత్రం తన తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త అమ్మను తీసుకువస్తే బావుండునని అనుకుంటుంది. ఇలా ఈ కథ సాగిపోతోంది.

పిల్లలు ఇద్దరూ ఇప్పుడు కార్తీక్..దీపలు ఇద్దరూ తమ అమ్మానాన్నలే అనే విషయానికి దగ్గరగా వచ్చేస్తున్నారు. కార్తీక్ తమ్ముడి భార్య శ్రావ్య డెలివరీ విషయంలో మౌనిత చిన్న నాటకం ఆడుతుంది. ఆమె కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందనీ.. డాక్టర్ మౌనిత వస్తే తప్ప ఏమీ చెయలెమనీ శ్రావ్యను చూస్తున్న డాక్టర్ రిజ్వనా తో అబద్ధం చెప్పిస్తుంది. దీంతో కార్తీక్ మౌనితకు ఫోన్ చేసి శ్రావ్యకు వైద్యం చేయమని మౌనితను కోరతాడు. మౌనిత తన పథకం పారిందని సంతోషించి.. అక్కడ మీ వాళ్ళు ఒప్పుకుంటేనే వస్తాను అంటుంది. దాంతో నేను చెప్పింది చేయి అంటూ విసుక్కుంటాడు కార్తీక్. అప్పుడు ఆసుపత్రికి వచ్చిన మౌనిత శ్రావ్యకు ఇంజక్షన్ ఇవ్వబోతుంది. అయితే, గతంలో తనకు ఇంజక్షన్ ఇచ్చి గర్భం పోగొట్టాలని మౌనిత ప్రయత్నించిన విషయం దీపకు గుర్తువచ్చి.. శ్రావ్యకు మౌనిత ఇంజక్షన్ ఇవ్వద్దని వారిస్తుంది. దీంతో కార్తీక్ దీప పై కోప్పడతాడు. మొత్తమ్మీద కొంత హంగామా తరువాత శ్రావ్యకు మగపిల్లవాడు పుట్టాడనీ,,తల్లీ పిల్లాడు క్షేమం అనీ మౌనిత చెప్పి వెళ్ళిపోతుంది. అందరూ హమ్మయ్య అనుకుంటారు. అయితే, ఇక్కడ పిల్లలిద్దరికీ దీప కార్తీక్ ల మధ్య ఎదో ఉందనే అనుమానం వస్తుంది. ముఖ్యంగా సౌర్య తల్లిని విసుక్కుని బలవంతంగా అక్కడ నుంచి లాక్కెళ్ళిపోతుంది.


ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ కు బ్రేక్ పడింది.. మరి ఇప్పుడు పిల్లలిద్దరికి నిజం తెలిసిపోతుందా? చాలా వరకూ నిజం తెలిసిన సౌర్య ఇప్పుడు ఎం చేయబోతోంది. తాననుకున్న పని నిర్విఘ్నంగా పూర్తీ చేసిన మౌనిత తరువాత ఏం చేస్తుంది? ఇటువంటి ప్రశ్నలకు జవాబులు కావాలంటే కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9 గంటలకు మాటీవీలో చూడాల్సిందే! 

Tags:    

Similar News