సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు 'కర్మణ్యే వాధికారస్తే'.. థ్రిల్లింగ్ మిస్టరీ కథా చిత్రం

Karmanye Vadhikaraste: ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ 'కర్మణ్యే వాధికారస్తే' సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2025-08-27 16:10 GMT

Karmanye Vadhikaraste: ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై రూపొందిన సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ 'కర్మణ్యే వాధికారస్తే' సినిమా సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించగా, డి.ఎస్.ఎస్. దుర్గాప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.

ఈ చిత్రంలో బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా తదితరులు కీలక పాత్రల్లో నటించగా, కృష్ణ భట్, ఇరా దయానంద్, అయేషా, రెహానా ఖాన్ వంటి కొత్త నటీనటులు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

కథపై చిత్రయూనిట్ విశ్వాసం

చిత్ర బృందం ప్రకారం, "'కర్మణ్యే వాధికారస్తే' అనే పదం భగవద్గీత నుంచి తీసుకున్నది. దీని అర్థం – 'నీకు పని చేయగల హక్కు ఉంది, కానీ ఫలితాలపై కాదు'. ఇదే అంశాన్ని ఆధారంగా తీసుకుని చిత్ర కథను నిర్మించాం."

ఇది ఒక ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్. కథలో విద్యార్థుల హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ లాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ మనం రోజూ వార్తల్లో చూసే సంఘటనల ఆధారంగా వాస్తవికంగా తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు.

ట్రైలర్ కు మంచి స్పందన

ఇటీవలే మధుర ఆడియో ద్వారా విడుదలైన ట్రైలర్‌కి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ట్రెండింగ్‌లోకి వచ్చిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. నటీనటుల నటన, కథన శైలి ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.

నటీనటులు:

బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్రన్, బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్ (నూతన పరిచయం), ఇరా దయానంద్ (నూతన పరిచయం), అయేషా (నూతన పరిచయం), రెహానా ఖాన్ (నూతన పరిచయం), జయ రావు, బాహుబలి మధు తదితరులు.

Tags:    

Similar News