భారతీయుడు2 లో కమల్ ఫోటోలు లిక్ ...

Update: 2019-10-23 16:07 GMT

షూటింగ్ దశలో ఉన్నప్పుడు సినిమాకి సంబంధించిన ఫోటోలు, వీడియో లీకులు.. సినిమా విడుదల అయ్యాక సినిమా పైరసీకి సంబంధించిన సమస్యలను ఇండస్ట్రీ ఎప్పటినుండో ఎదురుకుంటుంది. వీటిపైన ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఇవి మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈ లిస్టులోకి కమల్ హసన్ నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2 కూడా చేరిపోయింది . భోపాల్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.

ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో పోరాట సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఇందులో కమల్ సేనాపతిగా ఉన్న ఫోటోలు లీక్ అయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రకుల్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.  

Tags:    

Similar News