కనీసం సగం కూడా కవర్ చెయ్యని "బింబిసార"

"బింబిసార" నిర్మతలకు నష్టలేనా?

Update: 2022-07-07 16:00 GMT

కనీసం సగం కూడా కవర్ చెయ్యని "బింబిసార"

Bimbisara Theatrical Rights: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "బింబిసార". కొత్త డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ్ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న లుక్స్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు క్రూరమైన రాజు బింబిసార గా కనిపించనున్నారు.

కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కేథరిన్ తెరెసా మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. చోటా కె నాయుడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ సినిమా నాలుగు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న కళ్యాణ్ రామ్ సినిమా కోసం భారీ బడ్జెట్ ను పెడుతున్నారు.

తాజాగా ఈ సినిమా బడ్జెట్ 45 కోట్లు అని తెలుస్తోంది. అయితే థియేటర్ రైట్స్ తో సినిమాకి కనీసం అందులో సగం కూడా రావటం లేదు. ఈ సినిమా థియేటర్ రైట్స్ 18 కోట్లకి అమ్ముడయ్యాయి. ఇక సాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ కలిపినా కూడా మహా అయితే సగం బడ్జెట్ మాత్రమే కవర్ అయినట్టు. మరి సినిమా విడుదలయ్యాక కలెక్షన్లతో మిగతా సగం బడ్జెట్ ని ఎంతవరకు వసూలు చేస్తుందో ఇంకా వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News