Red Sandalwood: స్మగ్లింగ్ కేసులో ఉంది నేను కాదు.. నా ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
Jabardasth Comedian Hari: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి పేరు తెరపైకి వచ్చింది.
Red Sandalwood: స్మగ్లింగ్ కేసులో ఉంది నేను కాదు.. నా ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
Jabardasth Comedian Hari: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్ హరి పేరు తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో అది నేను కాదంటూ హరికృష్ణ మీడియా ముందు ఆవేదన చెందారు. స్మగ్లింగ్ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్ టీమ్‌లో వైఎస్ హరిబాబు పని చేశాడు. ఆ తర్వాత అతను ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. పోలీసుల విచారణలో అతను జబర్దస్త్ కామెడీ షోలో చేసినట్లు కూడా తేలింది. అప్పటికి నేను కూడా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. అయితే ఇప్పుడు గూగుల్‌లో జబర్దస్త్ హరి పేరు కొడితే నా ఫొటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో కొన్ని మీడియా సంస్థలు, వెబ్ సైట్లు నా ఫొటోలతో స్మగ్లింగ్ వార్తలు ప్రచురితం చేశాయి. దీని వల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను అని చెప్పుకొచ్చారు జబర్దస్త్ హరి. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ బయటపెట్టాడు.