ఆ అగ్రిమెంట్ అడిగినందుకేనా? నాగబాబు అందుకే జబర్దస్త్ వదిలేస్తున్నారా?

జబర్దస్త్ నుంచి నాగబాబు పక్కకు జరగాలని భావించడానికి కారణం మల్లెమాల ఎగ్రిమెంట్ ప్రయత్నాలు అని చెప్పుకుంటున్నారు.

Update: 2019-11-20 04:17 GMT
Nagababu with Anchor Ravi and Pradeep in New show promo

అవును అది నిజమవుతోంది. జబర్దస్త్ షో నుంచి నాగబాబు తప్పుకున్నట్లే. రకరకాలుగా వినిపించిన కథనాలు ఇప్పుడు నిజం కాబోతున్న సూచనలు పక్కాగా కనిపిస్తున్నాయి. అసలు జబర్దస్త్ విషయంలో ఏం జరుగుతోంది? ఎందుకు నాగబాబు తప్పుకుంటున్నారు? చమ్మక్ చంద్ర జబర్దస్త్ ఎందుకు వదిలేశారు? ఇంకా ఎవరెవరు జబర్దస్త్ నుంచి జరిగి పోబోతున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా ఓ కథనం జోరుగా ప్రచారం అవుతోంది. అదేమిటంటే..

మల్లెమాల తొందరపాటు నాగబాబుని దూరం జరిపింది. ఈటీవీ లో జబర్దస్త్ ని మించిన కార్యక్రమం మరోటి లేదంటే అతిశయోక్తి కాబోదు. ఎందుకంటే జబర్దస్త్ ప్రారంభం అయ్యాక ఈటీవీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి. దీనిని తట్టుకోవడం మిగిలిన చానెల్స్ కు సాధ్యం కాలేదు. జబర్దస్త్ విజయం తొ ఎగస్ట్రా జబర్దస్త్ ప్రారంభించి మరింత గా దూసుకుపోయింది ఈ టీవీ. దీంతో ప్రత్యర్థి ఛానెల్స్ జబర్దాస్త్ లాంటి షో చేయాలని విశ్వప్రయత్నాలు చేశాయి. కానీ, ఏవీ నిలబడలేదు. ఇందుకు కారణం ఒక్కటే. జబర్దస్త్ దర్శకులు నితిన్-భారత్ జోడీ. వీరి దర్శకత్వం లోనే జబర్దస్త్ మొదలైంది. ఇప్పటివరకూ కొనసాగింది. సరిగ్గా ఈ పాయింట్ ను పట్టింది జీ టీవీ. 

ఇప్పడు మొదలైంది అసలు కథ. మొదట బంపర్ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి నితిన్-భరత్ జోడీని లాగేసుకుంది. అయితే, ఈ దర్శక జోడీకి తాము ఇద్దరే ఏమీ చేయలేమని తెలుసు. అందుకే తమతో పాటూ జబర్దస్త్ కార్యక్రమంలో మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్ లని లాక్కురావడానికి ప్రయత్నాలు చేశారు. దీనిలో భాగంగా ముందు సై అంటూ జబర్దస్త్ ను వదలడానికి సిద్ధమైంది చమ్మక్ చంద్ర. భారీ రెమ్యునరేషన్.. అంటే దాదాపు ఎపిసోడ్ కి నాలుగు లక్షలు ఆయనకు ఆఫర్ చేశారని చెప్పుకుంటున్నారు. అటు తరువాత ఇంకా ఇద్దరు ముగ్గురు జబర్దస్త్ టీం లీడర్లకు భారీ ఆఫర్లు ఇచ్చారట. అయితే అవి ఇంకా ముందుకు పోలేదు. ఇక మొదట్లో జబర్దస్త్ లో ఒక ఊపు ఊపిన ధన్ రాజ్ లాంటి వారిని కూడా ఈ షో కి తీసుకున్నారు. దీంతో మల్లెమాల ఎలర్ట్ అయింది.

ఇక పరిస్థితి చేజారిపోతోందని మల్లెమాల చేసిన ఓ ప్రయత్నం అసలుకే ఎసరు తెచ్చిందని టాక్. అదే నాగబాబు జబర్దస్త్ వదిలేయడానికి కారణంగా మారిందని చెప్పుకుంటున్నారు. ఇనతకీ అదేమిటంటే.. దర్శక ద్వయం పక్కకి తప్పుకోవడం.. చమ్మక్ చంద్ర జారిపోవడం వంటివి చూసిన మల్లెమాల టీం మిగిలిన వారిని కాపాడుకునేందుకు ఎగ్రిమెంట్ చేయించుకునే పనిలో పడిందట. ఇక్కడ అసలు కథ మొదలై..నాగబాబు బయటకు వెళ్ళడానికి దారితీసిందనేది సమాచారం. టీం లీడర్ల తొ పాటు ఆ అగ్రిమెంట్ పై నాగబాబు కూడా సంతకం చేయాలని మల్లెమాల కోరిందని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన నాగబాబు దీనిని అవమానంగా భావించి జబర్దస్త్ వదిలేయడానికి సిద్ధం అయిపోయారు. దీనికి కారణం లేకపోలేదు.. గతంలో నాగబాబుకు వేరే చానెల్స్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా అయన మల్లెమాలతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కకు వేల్లలేదట. అయితే, అంత నమ్మకంగా నిలబడ్డ తనను అగ్రిమెంట్ కోరేసరికి ఆయనకు కోపం వచ్చిందని చెప్పుకుంటున్నారు.

ఈ విషయం తెల్సిన వెంటనే జీ టీవీ భారీ ఆఫర్ తొ నాగబాబును సంప్రదించింది. అసలే వేడి మీద ఉన్న నాగబాబు ఈ ఆఫర్ కు ఓకే అనేశారు. ఇదీ సంగతి. ఇదంతా నిజామా కాదా అనే చర్చలు పక్కన పెడితే నాగబాబు జబర్దస్త్ నుంచి పక్కకు తప్పుకుంటున్నారనేది పక్కా! ఈ వారం వచ్చే జబర్దస్త్ ఎపిసోడ్ లు నాగబాబు చివరి ఎపిసోడ్ లు కానున్నాయి. ఎందుకంటే, జీ టీవీ లో ఈ ఆదివారం నుంచే కొత్త కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. దానిలో నాగబాబు కనిపిస్తున్న ప్రోమోలు ఇప్పటికే సందడి చేస్తున్నాయి. ఇంకో విషయం ఏమిటంటే, జబర్దస్త్ నుంచి సుడిగాలి సుదీర్.. హైపర్ ఆది కూడా తప్పుకుంటున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఎంత వరకూ నిజాలో తేలాలంటే ఆదివారం వరకూ వేచి చూడాల్సిందే!

Tags:    

Similar News