Aamir Khan: ఆ బాలీవుడ్ నటితో అమీర్ ఖాన్ మూడో పెళ్లి..!?

Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవలే తన 15 ఏళ్ళ వైవాహిక జీవితానికి కిరణ్ రావు తో విడాకులతో ముగింపు పలుకడంతో

Update: 2021-07-05 11:15 GMT

అమిర్ ఖాన్, సన షేక్, కిరణ్ రావు (ఫైల్ ఫోటో)

Aamir Khan: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇటీవలే తన వైవాహిక జీవితానికి కిరణ్ రావుకు విడాకులతో ముగింపు పలుకడంతో తాజాగా తన మూడో పెళ్లిపై బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. మొదటగా 1986 లో రీనా దత్తాని పెళ్లి చేసుకొని సరిగ్గా 15 ఏళ్ళకే విడాకులు తీసుకున్న అమీర్ ఖాన్ తర్వాత 2005 సంవత్సరంలో కిరణ్ రావు ని వివాహం చేసుకొని అదే 15 ఏళ్ళకి మరోసారి విడాకులు తీసుకున్నారు. అయితే ఈసారి ఈ బాలీవుడ్ నటుడు విడాకులు తీసుకోడానికి కారణం మరొక బాలీవుడ్ హీరోయిన్ అని అటు సోషల్ మీడియా తో పాటు బాలీవుడ్ లోనూ టాక్. "దంగల్" చిత్రంలో అమీర్ ఖాన్ కి కూతురు గా నటించిన నటి ఫాతిమా సన షేక్ తో అమీర్ ఖాన్ ప్రేమలో ఉన్నాడని అందువల్లనే ఆ నటికి ఆ తర్వాత చిత్రమైన "ది థగ్స్ అఫ్ హిందూస్తాన్" చిత్రంలో అమీర్ సరసన నటించడానికి అవకాశం కూడా ఇచ్చారని సమాచారం.

మరోపక్క ముంబైకి వచ్చిన ప్రతిసారి ఫాతిమా.. అమీర్ ను కచ్చితంగా కలుస్తుందని, వీరిద్దరూ కలిసి చాలా పార్టీలకి కూడా హాజరయ్యారని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ప్రస్తుతం 29 ఏళ్ళు ఉన్న ఈ భామ 1992 లో హైదరాబాద్ లో జన్మించి 2016 లో చాచి 420, వన్ 2 కా 4 వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ భామతో ప్రేమ వ్యవహారం వల్లనే అమీర్ దంపతులు విడిపోయారని ప్రస్తుతం ఈ విడాకుల విషయం కాస్త సద్దుమనిగాక 56 ఏళ్ళ వయస్సు ఉన్న అమీర్ ఖాన్ ఈ 29 ఏళ్ళ భామని పెళ్లి కూడా చేసుకోబుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News