బిగ్‌బాస్‌ ఎంతమంది బావుందన్నారో తెలుసా?

Update: 2019-07-24 08:11 GMT

బిగ్‌బాస్‌ రియాల్టీ షోలలో ఓ సంచలనం. అన్ని భాషల్లోనూ వివాదాల్లో ఇదే టాప్. విమర్శల్లో ఇదే నెంబర్ 1. ప్రేక్షకాదరణ లోనూ బిగ్‌బాస్‌ సూపర్ గానే ఉంటుంది. ఇప్పుడు తెలుగు లో మూడో సీజన్ ఆదివారం ప్రారంభమయింది. ఎప్పటికప్పుడు షో ఎలా ఉందొ తెలుసుకోవడానికి బిగ్‌బాస్‌ ట్విట్టర్ లో ఓటింగ్ పెడుతుంటారు. ఇప్పుడు కూడా మొదటి రోజు బిగ్‌బాస్‌ ఎలా ఉంది అని ఓటింగ్ పెట్టారు. దీనిలో పాల్గొన్న వాళ్ళలో 38 శాతం మంది బావుందని వోట్ చేశారు. ఇక దాదాపుగా అంతే స్థాయిలో అంటే 33 శాతం మంది ఎవరేజ్ అన్నారు. ఓ 5 శాతం మంది ఓకే అన్నారు. 23 శాతం మంది మాత్రం ఇంటరెస్ట్ లేదని సమాధానానికి ఓటేశారు.  

Tags:    

Similar News