కత్తి పట్టిన తనీష్ ... మహాప్రస్థానం ఫస్ట్ లుక్ అరాచకం

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తనీష్ మంచి సక్సెస్ అయ్యాడు..ఇక హీరోగా మారి నచ్చావులే, మేం వయసుకు వచ్చాం

Update: 2020-03-22 07:26 GMT
tanish mahaprasthanam first look

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తనీష్ మంచి సక్సెస్ అయ్యాడు..ఇక హీరోగా మారి నచ్చావులే, మేం వయసుకు వచ్చాం మొదలగు సినిమాల్లో నటించి హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కానీ గత కొద్ది రోజులుగా హిట్లు లేక తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో జానీ అనే కొత్త దర్శకుడితో మహాప్రస్థానం అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ఈ చిత్ర బృందం.

"గుండె కన్నీరైతే.. ఆవేశం ఆయుధమైతే ..ఆ కత్తి రాసే రుధీర కావ్యమే మహాప్రస్థానం " అనే వాయిస్ ఓవర్ తో మోషన్ పోస్టర్ నీ చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో తనీష్ కత్తి పట్టుకొని చాలా వైలెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో తనీష్ సరసన మస్కాన్ సేధీ హీరోయిన్ గా నటిస్తుంది.. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా , రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు ఓంకారేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా విడుదల కానుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Full View


Tags:    

Similar News