Sharwanand Ready To Marriage : పెళ్ళికి రెడీ అయిన శర్వానంద్.. స్నేహితురాలే వధువు!
Sharwanand Ready To Marriage : కరోనా సమయంలో కూడా చాలా మంది సినిమా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే.. టాలీవుడ్ లో
sharwanand
Sharwanand Ready To Marriage : కరోనా సమయంలో కూడా చాలా మంది సినిమా సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే.. టాలీవుడ్ లో యంగ్ హీరోలు అయిన నిఖిల్, నితిన్, రానా ఓ ఇంటివాళ్ళు అయ్యారు. ఇప్పుడు మరో హీరో కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నాడని తెలుస్తోంది. ఇంతకి ఈ హీరో ఎవరో కాదు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో శర్వానంద్.. హీరోగా గత 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగాతున్నాడు శర్వానంద్ .. ప్రస్తుతం శర్వానంద్ వయస్సు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఈ నేపధ్యంలో అయన కుటుంబ సభ్యులు మేరకు శర్వానంద్ పెళ్లికి రెడీ అయ్యాడని తెలుస్తోంది.
అయితే శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదట.. తన చిన్నప్పటి స్నేహితురాలేనట.. అయితే గత కొంతకాలంగా ఆమెతో ప్రేమలో ఉన్నాడట..ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దల వద్దకు తీసుకెళ్లి అందరి అంగీకారం పొందారట. త్వరలో వీరిద్దరికీ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి పారిశ్రామికవేత్తగా ఉందని తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడనుంది.
ఇక శర్వానంద్ సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది జాను సినిమాతో ఆకట్టుకున్న శర్వానంద్ ప్రస్తుతం 'శ్రీకారం' అనే మూవీలో నటిస్తున్నాడు.. ఇక ఈ సినిమాతో పాటుగా అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం, కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమాని చేస్తున్నాడు.. వచ్చే ఏడాది సినిమాలు విడుదలు కానున్నాయి..