Ram Charan praise On Uma Maheswara Ugra Roopasya : ఆ మూవీకి ఫిదా అయిపోయిన రామ్​చరణ్!

Ram Charan praise On Uma Maheswara Ugra Roopasya : నటుడు సత్యదేవ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య’..

Update: 2020-08-11 09:08 GMT
Ram charan (File Photo)

Ram Charan praise On Uma Maheswara Ugra Roopasya : నటుడు సత్యదేవ్ ప్రధానపాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య'.. కంచరపాలెం ఫేం వెంకటేష్ మహా దీనికి దర్శకత్వం వహించగా, బహుబలి ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని నిర్మించారు.. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అయి మంచి టాక్ ని సంపాదించుకుంది.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం.. ఇక ఇందులో సత్యదేవ్ నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు.. ఇక మిగతా వారు తమ పాత్రలకి న్యాయం చేశారు.. మొత్తానికి ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్ని అందుకుంది..

అయితే తాజాగా ఈ సినిమాని చూసిన మెగాపవర్ స్టార్ రామ్​చరణ్ తేజ్ ఈ చిత్రం పై ప్రశంసలు కురిపించాడు.. ట్విట్టర్ వేదికగా స్పందించిన రామ్ చరణ్.. "'ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య' సినిమా నాకు చాలా బాగా న‌చ్చింది. సినిమా కంటెంట్ చాలా ఒరిజిన‌ల్‌గా ఉంది. వారివారి పాత్రల్లో న‌టీన‌టులు అంద‌రూ అద్భుతంగా ఒదిగిపోయారు. వెంక‌టేశ్ మ‌హా ద‌ర్శక‌త్వ విధానం బాగుంది. నిర్మాత‌ల‌కు శుభాకాంక్షలు." అంటూ రామ్ చ‌ర‌ణ్ తేజ్ ట్వీట్ చేశారు. తమ సినిమా పట్ల రామ్ చరణ్ స్పందించడంతో చిత్రబృందం హ్యాపీగా ఫీల్ అవుతుంది..



ఇక అటు రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది..ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా, డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్నాడు. 

Tags:    

Similar News