Ram Charan On Varun Tej And Sai Tej : మెగా బ్యాచిలర్స్ పెళ్లిళ్లపై చిట్టిబాబు ఏమన్నాడంటే?

Ram Charan On Varun Tej And Sai Tej : సినిమా ఇండస్ట్రీలో మొన్నటివరకూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన నిఖిల్, నితిన్, రానా తాజాగా లాక్ డౌన్

Update: 2020-08-16 09:27 GMT
Ram charan,varun tej , sai dharam tej (File Photo)

Ram Charan On Varun Tej And Sai Tej : సినిమా ఇండస్ట్రీలో మొన్నటివరకూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన నిఖిల్, నితిన్, రానా తాజాగా లాక్ డౌన్ టైంలో పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే.. ఇక త్వరలో మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పెళ్లి పీటలు ఎక్కనుంది. దీనితో టాలీవుడ్‌లో ఇంకా మిగిలి ఉన్న బ్యాచిలర్స్ పెళ్లిళ్లపైన ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. అందులో భాగంగా తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగా బ్యాచిలర్స్ పెళ్లిళ్లపై ఆసక్తికరమైన వాఖ్యలు చేసాడు...

లాక్ డౌన్ సమయంలో నిఖిల్ , నితిన్, రానా వంటి హీరోలు ఓ ఇంటి వాళ్ళు కావడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు చరణ్.. ఇందులో రానా దగ్గుబాటి మంచి పని చేసి తన కుటుంబంలో అమితమైన ఆనందం నింపాడని అన్నాడు చరణ్... అటు తన తన చెల్లెలు నిహారిక- చైతన్య జోడీ చాలా బాగుందని చెప్ప్పుకోచ్చాడు.. ఈ క్రమంలో తన ఫ్యామిలీలోని మెగా బ్యాచిలర్స్ పెళ్లిళ్లపై ఓపెన్ అయ్యాడు చరణ్.. తమ ఫ్యామిలీలో బ్యాచిలర్స్ ఇంకా ఉన్నారని వారి పెళ్లి కోసం ఎంతో ఎదురు చూస్తునట్టుగా చరణ్ వెల్లడించాడు.. ఇందులో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ పెళ్లిళ్లు ఎప్పుడెప్పుడా అనే ఆసక్తి తనలో ఉందని అన్నాడు చరణ్..

ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 

Tags:    

Similar News