Chiru - Meher Ramesh: చిరు, మెహర్ రమేష్ మూవీని కన్ఫామ్ చేసిన పవన్!

Chiranjeevi With Meher Ramesh : గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో

Update: 2020-09-03 10:04 GMT

Mehar Ramesh, Chiranjeevi

Chiranjeevi With Mehar Ramesh : గత ఏడాది సైరా చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే చిత్రం చేస్తున్నారు.. ఇది చిరంజీవికి 152వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.

అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో ఆచార్య తరవాత చేయబోయే చిత్రాలకి సంబంధించిన కథలను వింటున్నట్టుగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు ఫిక్స్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ దీనిపైన ఎవరు కూడా స్పందించలేదు..

అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్ పవన్ కు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే దీనిపై పవన్ స్పందిస్తూ... రమేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా చిరంజీవితో మీరు తీయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్ అంటూ పవన్ ట్వీట్ చేశారు. దీనితో చిరు, మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని కన్ఫామ్ అయింది. వీరి కాంబినేషన్ లో వచ్చే సినిమాకి తమిళ్ లో మంచి హిట్ అయిన వేదాళం రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఎస్ రామారావు నిర్మిస్తారని టాక్.


Tags:    

Similar News