Pawan Kalyan Vakeel Saab: ట్రెండింగ్ లో వకీల్ సాబ్!
Pawan Kalyan Vakeel Saab: అజ్ఞాతవాసి చిత్రం తరవాత సినిమాలకి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకుల
vakeel saab movie
Pawan Kalyan Vakeel Saab: అజ్ఞాతవాసి చిత్రం తరవాత సినిమాలకి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.. అయితే ఈ మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మోషన్ పోస్టర్ ని సెప్టెంబర్ 2 న ఉదయం విడుదల చేయగా, కేవలం 6 గంటల్లోనే నెంబర్ 1 స్థానంలోకి ట్రెండింగ్ లోకి వచ్చేసి ఇప్పటికి యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలోనే కొనసాగుతుంది. ఇప్పటివరకూ ఈ మోషన్ పోస్టర్ కి 2.5 మిలియన్ వ్యూస్ రాగా, 2 లక్షల 10 వేలకు పైగా లైక్స్ ను దక్కించుకుంది. దీనితో మళ్ళీ పవన్ హవా మొదలైందని అర్ధం అయిపోతుంది.
ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ తో పాటుగా నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్యపాత్రాలు పోషిస్తున్నరు.. వచ్చే ఏడాది సంక్రాంతికి వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి ఇది రీమేక్.
ఇక ఈ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి మరో రెండు సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ఈ సినిమాని ఎఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు పవన్. . ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పవన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్ లను రిలీజ్ చేశారు మేకర్స్..