Vakeel Saab Motion Poster: 'పవర్' ఫుల్ 'వకీల్ సాబ్'.. మోషన్ పోస్టర్ తో చించేశాడంతే!

Vakeel Saab Motion Poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా..

S. Srikanth
Updated on: 2 Sept 2020 9:50 AM IST
Vakeel Saab Motion Poster: పవర్ ఫుల్ వకీల్ సాబ్.. మోషన్ పోస్టర్ తో చించేశాడంతే!
X

Vakeel Saab Motion Poster: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా.. ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్ లు ఒక నటుడు స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేస్తాయి.. కానీ వాటితో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగారు పవన్.. నేడు పవన్ కళ్యాణ్ తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..

అయితే, పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన రీఎంట్రీ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది చిత్రబృందం. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.. విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. మోషన్ పోస్టర్ లో లాయర్ గా పవన్ లుక్ కూడా ఆదరిపోయింది..

ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ తో పాటుగా నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్యపాత్రాలు పోషిస్తున్నరు.. వచ్చే ఏడాది సంక్రాంతికి వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి ఇది రీమేక్..

ఇక ఈ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి మరో రెండు సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు పవన్. . ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.ఈ సినిమాలకు సంబంధించి కుడా నేడు అప్డేట్ రానుందని సమాచారం.



S. Srikanth

S. Srikanth

Next Story