బిగ్బాస్ ఇంట్లోకి తొమ్మిదో కంటెస్టెంట్గా ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం వెళ్ళింది. చిన్న చిన్న పాత్రలతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న పునర్వసు ఇక్కడ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఫైర్ బ్రాండ్ హేమ బిగ్బాస్ ఇంట్లోకి కాలు పెట్టింది. టాలీవుడ్ కామెడీ ఆర్టిస్తుల్లో ప్రత్యెక ముద్ర వేసి మా ఎన్నికల్లో తన సత్తా చూపించిన హేమ బిగ్బాస్ లో ఎలా నెగ్గుకొస్తుందో కొంత ఆసక్తికరంగానే ఉంది.
పదకొండో కంటెస్టెంట్గా ధృవ సినిమాలో రామ్ చరణ్ స్నేహితుడిగా పోలీస్ పాత్రలో నటించిన ప్రముఖ నటుడు అలీ రెజా ఎంట్రీ ఇచ్చాడు. ఇక పన్నెండో కంటెస్టెంట్గా యూట్యూబ్లో స్టార్ కమెడియన్గా ఫేమస్ అయిన మహేష్ విట్టా బిగ్బాస్ హౌస్లోకి వెళ్ళాడు.