HBD Kajol: పుట్టినరోజు స్పెషల్.. నటి కాజోల్ ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలు!
బాలీవుడ్ ఫేమస్ యాక్ట్రెస్ కాజోల్ (Kajol) నేడు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మూడు దశాబ్దాలుగా నటనలో తనదైన ముద్ర వేసుకున్న కాజోల్ ఇప్పటికీ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
HBD Kajol: పుట్టినరోజు స్పెషల్.. నటి కాజోల్ ఆస్తులు, రెమ్యూనరేషన్ వివరాలు!
బాలీవుడ్ ఫేమస్ యాక్ట్రెస్ కాజోల్ (Kajol) నేడు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మూడు దశాబ్దాలుగా నటనలో తనదైన ముద్ర వేసుకున్న కాజోల్ ఇప్పటికీ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతూ రేర్ ఫొటోల్ని షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ఆమె ఆస్తులు, రెమ్యూనరేషన్, లైఫ్స్టైల్ వంటి వివరాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
కాజోల్ నికర ఆస్తులు ఎంతంటే..?
తాజా అంచనాల ప్రకారం, కాజోల్ దగ్గర సుమారు రూ.249 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని సమాచారం. జుహూలోని 'శివశక్తి' అనే విలాసవంతమైన బంగ్లాలో నివసించే కాజోల్ ఇల్లు మాత్రమే రూ.60 కోట్ల విలువచేస్తుందట. దీంతో పాటు జుహూలో మరో రెండు అపార్ట్‌మెంట్‌లు, లండన్‌లో ఒక విలాసవంతమైన హౌస్ కూడా ఆమెకు ఉన్నట్లు తెలుస్తోంది.
కారు కలెక్షన్ ఎంత గ్లామరస్‌గా ఉందంటే..
కాజోల్ లగ్జరీ కార్లకు మక్కువ కలిగినవారు. ఆమె గ్యారేజ్‌లో BMW X7, Audi Q7 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.
సినిమా, బ్రాండ్స్, బిజినెస్ లతో భారీ రెవెన్యూ
ఒక్క సినిమాకే రూ.10 కోట్లు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న కాజోల్, సినిమాలకంటే ఎక్కువగా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. అంతేకాదు, భర్త అజయ్ దేవగన్‌తో కలిసి నిర్మాతగా కూడా పలు సినిమాలు తెరకెక్కించారు.
అజయ్ దేవగన్‌తో బర్త్‌డే విషెస్
కాజోల్ పుట్టినరోజు సందర్భంగా భర్త అజయ్ దేవగన్ సోషల్ మీడియా వేదికగా హృదయపు సందేశం షేర్ చేశారు. "నీకెన్నో చెప్పాలనుంది కానీ చెప్పిన నువ్వు నమ్మలేవు.. అందుకే నాయ్ ఫేవరెట్, హ్యాపీ బర్త్‌డే!" అంటూ ఆయన పోస్ట్ వైరల్ అవుతోంది.
కాజోల్ స్టార్‌డమ్, విజయాలు, జీవితశైలి ఇలా చూసిన తర్వాత, ఆమె నిజంగా బాలీవుడ్‌లో అత్యంత ప్రభావవంతమైన నటీమణుల్లో ఒకరని చెప్పడంలో సందేహం లేదు.
హ్యాపీ బర్త్‌డే కాజోల్!