Happy Birthday: ఎన్టీఆర్.. టాలీవుడ్ ఆల్ రౌండర్.. ఫ్యాన్స్ కోరిక తీరుస్తాడా?
బాలనటుడి నుంచి అగ్రకథానాయకుడి వరకు టాలీవుడ్ లో యంగ్ టైగర్ యంగ్ హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో సత్తాచూపిస్తున్నాడు.
బాలనటుడి నుంచి అగ్రకథానాయకుడి వరకు టాలీవుడ్ లో యంగ్ టైగర్ యంగ్ హీరోల్లో యాక్టింగ్, డైలాగ్, డాన్సుల్లో సత్తాచూపిస్తున్నాడు. విభిన్న పాత్రలో యాక్ట్ చేస్తూ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. తెలుగుప్రేక్షక తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. నందమూరి తారక రామారావు, అభిమానులు ముద్దుగా జూనియర్ ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు. నేడు తారక రాముని పుట్టినరోజు సందర్భంగా hmtv స్పెషల్ విషెస్..
జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. యాక్షన్లో పర్ ఫెక్షన్, డైలాగ్స్ లో ఎమోషన్, మూమెంట్స్ లో ఒక రకమైన రిథమ్ కంపల్సరీ. రూపంలో తాత పోలికలే కాదు. అభినయంలోను ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు.డైలాగ్స్ కూడా ఒకరేంజ్ లో చెప్పేస్తాడు.
జూనియర్ ఎన్టీఆర్ 'బ్రహర్షి విశ్వామిత్ర' లో బాలనటుడిగా తాతాతో కలిసిపోయారు వెండితెరపై మెరిసాడు. అయినా తారక్ కు పేరు తీసుకొచ్చింది మాత్రం 1997లో వచ్చిన 'బాల రామాయణం'. ఈ చిత్రంలో బాలరాముడిగా పౌరాణిక పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమాతో తొలిసారి నంది అవార్డు సైతం అందుకున్నాడు.
ఇక హీరోగా 2001లో ఉషాకిరణ్ మూవీస్ వారి 'నిన్నుచూడాలని' చిత్రంతో పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేడు. అయినా నిరాశపడలేదు. సినిమాపై తనకున్న ప్రేమతో ముందుకు సాగాడు. రాజమౌళి పరిచయం ఒకవరంగా మారింది. వీరిద్దరి కలయికలో వచ్చిన 'స్టూడెంట్ నెం.1' హీరోగా తొలిసారి సక్సెస్ రుచి చూసాడు. ఈ మూవీ సాధించిన విజయంతో ఎన్టీఆర్ వెనుతిరిగా చూసుకోలేదు.
స్టూడెంట్ నెం.1 , 'సుబ్బు' బాక్సాఫీసు వద్ద సరైన రిజల్ట్ ఇవ్వలేదు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన 'ఆది' సూపర్ డూపర్ హిట్టయింది. అందులో తారక్ చెప్పే డైలాగులు మాస్ లో తిరుగులేని ఇమేజ్ ను తీసుకొచ్చాయి. ఈ సినిమా సక్పెస్ తో టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద తన స్టామినా ఏంటో చూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేసిన నిరాశ పరిచాయి. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో చేసిన 'సింహాద్రి'తో మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.
యమ దొంగతో మరోసారి యంగ్ యమగా నటించిన తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. 'బృందావనం' సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్‌ను మరో కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం 'టెంపర్' ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనను ఎవరు మరిచిపోలేదు. 'జనతా గ్యారేజ్','జై లవకుశ','అరవింద సమేత వీర రాఘవ' వంటి వరుస సక్సెస్‌లను అందుకున్నాడు. 'జైలవకుశ' సినిమాలో త్రిపాత్రాభియం చేసి మెప్పించాడు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ తరహా పాత్రను పోషిస్తున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కృష్ణుడిగా నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక తీరుస్తాడో లేదో చూడాలి.