Godfather Twitter Review: 'గాడ్ ఫాదర్' ట్విటర్ట్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..
Godfather Twitter Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా భారీ అంచనాలతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
Godfather Twitter Review: ‘గాడ్ ఫాదర్’ ట్విటర్ట్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..
Godfather Twitter Review: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా భారీ అంచనాలతో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ గాడ్ ఫాదర్ సినిమా తెలుగు సహా హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా మలయాళ లూసిఫర్ సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందింది. గాడ్ ఫాదర్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఆల్రెడీ యూఎస్ ఆడియెన్స్ సినిమాను చూసేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముందుగానే షోలు పడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో గాడ్ ఫాదర్ ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 'గాడ్ ఫాదర్' కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ట్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.