అఖిల్, మోనాల్ కి మధ్య ఏముంది.. గంగవ్వ ఏమందంటే?

Gangavva About Akhil And Monal : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సిజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మందితో మొదలైన ఈ ఎపిసోడ్ ఎలిమినేషన్ లు, ఎమోషన్స్, ఫన్నీ టాస్క్ లతో మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Update: 2020-10-18 07:32 GMT

Gangavva About Akhil And Monal : అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సిజన్ 4 మంచి రసవత్తరంగా సాగుతుంది. 16 మందితో మొదలైన ఈ ఎపిసోడ్ ఎలిమినేషన్ లు, ఎమోషన్స్, ఫన్నీ టాస్క్ లతో మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అయితే హౌస్ లోని సభ్యులకు గట్టి పోటి ఇస్తూ అయిదు వారాల పాటు హౌస్ లో ఉన్న గంగవ్వ అనారోగ్య సమస్యలతో అక్కడ ఉండలేక హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. హౌస్ నుంచి బయటకు వచ్చాక పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీ అయిపొయింది. అందులో భాగంగానే తాజాగా మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ సుజాతతో కలిసి HMTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది గంగవ్వ.

ఈ ఇంటర్వ్యూలో గంగవ్వ అఖిల్, మోనాల్ ల గురించి మాట్లాడుతూ.. ఎక్కువగా అఖిల్ మోనాల్ తో ఉంటాడని, ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఉందని గంగవ్వ చెప్పుకొచ్చింది. అయితే తాను అప్పుడప్పుడు మోనాల్ పైన కసురుకున్నట్టుగా చెప్పుకొచ్చింది గంగవ్వ.. ఎక్కువగా మోనాల్ అఖిల్ పైన అలిగేదని అందుకే కసురుకునట్టుగా తానూ మాట్లదేదానినని చెప్పుకొచ్చింది గంగవ్వ . ఇక ఈ ఇంటర్వ్యూలో గంగవ్వ అఖిల్ అంటే తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

అఖిల్ తనకి దత్తపుత్రుడు అవుతాడేమోనని అంటూ గంగవ్వ వెల్లడించింది. హౌస్ లో ఉన్నప్పుడు అఖిల్ తనని అన్నీ విషయాల్లో తనని చాలా బాగా చూసుకున్నాడని చెప్పుకొచ్చింది గంగవ్వ . తనకి ఆరోగ్యం బాలేనప్పుడు మెడికల్ రూమ్ కి వెళ్లి టాబ్లెట్స్ తీసుకొనివచ్చి తనకి ఇచ్చేవాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకి కాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు కాళ్ళు నొక్కి మరి సొంత అమ్మమ్మ లేదా నాయినమ్మ లాగా చూసుకున్నాడని గంగవ్వ చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అంది. అటు బిగ్ బాస్ షో కి వెళ్లి విన్నర్ గా నిలవలెకపొయున చాలా మంది హృదయాలను గెలుచుకుంది గంగవ్వ!


Full View

 

Tags:    

Similar News