Yemi Maya Premalona: యూత్‌ను ఆకట్టుకుంటున్న 'ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బమ్: అనూహ్య రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లో!
Yemi Maya Premalona: అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుండి వచ్చిన తాజా మ్యూజికల్ ఆల్బమ్ 'ఏమి మాయ ప్రేమలోన' యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Yemi Maya Premalona: యూత్‌ను ఆకట్టుకుంటున్న 'ఏమి మాయ ప్రేమలోన' మ్యూజిక్ ఆల్బమ్: అనూహ్య రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లో!
Yemi Maya Premalona: అకీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుండి వచ్చిన తాజా మ్యూజికల్ ఆల్బమ్ 'ఏమి మాయ ప్రేమలోన' యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అనిల్ ఇనమడుగు హీరోగా, వేణి రావ్ హీరోయిన్ గా నటించిన ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే 1 మిలియన్ వ్యూస్‌ని సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ పాటకు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే, లీడ్ రోల్‌లో నటించిన అనిల్ ఇనమడుగు తానే స్వయంగా లిరిక్స్ అందించి, దర్శకత్వం వహించడం. మార్క్ ప్రశాంత్ అందించిన మధురమైన సంగీతానికి దిన్కర్ కలవుల, దివ్య ఐశ్వర్య తమ గాత్రంతో ప్రాణం పోశారు.
కేరళలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేసే అనాథ యువకుడి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి వస్తుంది. మేఘాలు కమ్ముకున్న రోజున కనిపించిన మెరుపులాంటి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకునే ప్రయత్నాన్ని ఈ పాట సున్నితంగా ఆవిష్కరిస్తుంది.
దసరా కానుకగా విడుదలైన ఈ పది నిమిషాల నిడివి గల ఆల్బమ్, అద్భుతమైన నిర్మాణ విలువలతో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ శ్రవణ్ కేరళలోని సుందరమైన లొకేషన్స్‌ను కనులవిందుగా చిత్రీకరించారు. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా చూపించారు. తెరపై అనిల్, వేణి రావ్ జోడీ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. సహజమైన వారి నటన ఈ పాట విజయానికి మరింత దోహదపడింది.
యంగ్ నిర్మాతలు అజయ్ కుమార్ ఇనమడుగు, విష్ణు పాదర్తి అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సాంగ్‌ను నిర్మించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ 'ఏమి మాయ ప్రేమలోన' ప్రస్తుతం సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంటోంది.