Vani Jairam: వాణీజయరాం పోస్ట్‌మార్టమ్‌లో తలకు గాయాన్ని గుర్తించిన డాక్టర్లు

Vani Jairam: తుదిశ్వాస విడిచిన గానకోకిల వాణీజయరాం

Update: 2023-02-05 03:36 GMT

Vani Jairam: వాణీజయరాం పోస్ట్‌మార్టమ్‌లో తలకు గాయాన్ని గుర్తించిన డాక్టర్లు

Vani Jairam: దిగ్గజ గాయని వాణీ జయరాం మరణవార్తతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన గానామృతంతో యావత్‌ భారతీయ సమాజాన్ని ఓలలాడించిన ఓ గొంతు శాశ్వతంగా మూగవోయింది. దశాబ్దాల పాటు సంగీత సామ్రాజ్ఞిగా అప్రతిహతంగా వెలిగిన గానకోకిల వాణీజయరాం అనంత లోకాలకు తరలివెళ్ళారు. చెన్నైలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి.

వాణీ జయరాం ముఖంపై బలమైన గాయాలతో రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉండడంతో ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో వెంటనే వాణీ జయరాం ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె తుదిశ్వాస విడిచారు. వాణి జయరాం మృతిని అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చెపట్టారు. వాణీ జయరం పోస్ట్ మార్టంలో ఆమె తలకు గాయమైనట్టు గుర్తించారు. ఒకటిన్నర ఇంచు లోతు గాయమైనట్లుగా తేలింది. అయితే వాణీ జయరాం తలకు తగిలిన గాయంపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమన్నారు పోలీసులు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం వాణీ జయరాం అంత్యక్రియలు జరగనున్నాయి. 

Tags:    

Similar News