Harish Shankar : మళ్ళీ అదే హీరోయిన్ ని రిపీట్ చేస్తున్న హరీష్?
Harish Shankar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా
Gabbar singh Movie making poster (File Photo)
Harish Shankar : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ కి ఇది 28 వ చిత్రం కావడం విశేషం.. ఇక ఇప్పటికే పవన్, హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఇదే కాంబినేషన్ నుంచి ఎనిమిదేళ్ళ తరవాత సినిమా వస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాకి సంబంధించిన అప్డేట్ ని రిలీజ్ చేశారు మేకర్స్.. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఇందులో ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకంతో పాటు ఇండియా గెట్, సర్దార్ వల్లభాయి పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫోటోలను ఆ పోస్టర్ పై ఉంచింది. దీనితో ఓ సందేశాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతుందని అర్ధం అవుతుంది.. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం మేరకు ఇందులో పవన్ సరసన పూజా హెగ్డేను ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.. ఇక పూజా గతంలో హరీష్‌శంకర్ తెరకెక్కించిన దువ్వాడ జగన్నాథమ్, గద్దలకొండ గణేష్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.