PSPK 28 First Look: ఎనిమిదేళ్ళ తరువాత మళ్ళీ 'గబ్బర్ సింగ్' తో హరీష్ రెడీ!

PSPK 28 First Look: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా..

S. Srikanth
Published on: 2 Sept 2020 7:20 PM IST
PSPK 28 First Look: ఎనిమిదేళ్ళ తరువాత మళ్ళీ గబ్బర్ సింగ్ తో హరీష్ రెడీ!
X

PSPK 28 First Look: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా.. ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్ లు ఒక నటుడు స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేస్తాయి.. కానీ వాటితో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగారు పవన్.. నేడు పవన్ కళ్యాణ్ తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా.. పవన్ 28వ సినిమాకి సంబంధించి అప్ డేట్ విడుదలైంది. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.. ' ఈ సారి ఇది ఎంటర్టైన్మెంట్ కాదు' అని ఓ బైక్ పై పెద్ద బాలశిక్ష పుస్తకంతో పాటు ఇండియా గ్రేట్ సర్దార్ వల్లభాయి పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫోటోలను ఆ పోస్టర్ పై ఉంచింది. ఈ చిత్రాన్ని గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.



అయితే, పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన రీఎంట్రీ మూవీగా వస్తున్న 'వకీల్ సాబ్' సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ నుకుడా నేడు పవన్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో విడుదల చేసింది చిత్రబృందం. లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించబోతుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.. విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. మోషన్ పోస్టర్ లో లాయర్ గా పవన్ లుక్ కూడా ఆదరిపోయింది..

ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్‌ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ తో పాటుగా నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్యపాత్రాలు పోషిస్తున్నరు.. వచ్చే ఏడాది సంక్రాంతికి వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం.. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమాకి ఇది రీమేక్..

వకీల్ సాబ్ తో పాటు కృష దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోయే తన తదుపరి సినిమా ఫస్ట్ లుక్ కుడా తన పుట్టిన రోజు సందర్బంగా క్రిష్ ట్విట్టర్ ద్వారా రిలేజ్ చేసాడు. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అని సమాచారం.


S. Srikanth

S. Srikanth

Next Story