D Srinivas: డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. ఎంపీ అరవింద్ కార్యక్రమాలన్ని రద్దు..
D Srinivas: డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. ఎంపీ అరవింద్ కార్యక్రమాలన్ని రద్దు..
D Srinivas: డీఎస్‌కు తీవ్ర అస్వస్థత.. ఎంపీ అరవింద్ కార్యక్రమాలన్ని రద్దు..
D Srinivas: సీనియర్ నేత, మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ (డీఎస్) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్యానికి గురికావడంతో ఆయన్ను బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, వైద్య పరీక్షల అనంతరం డీఎస్ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి శ్రీనివాస్‌కు అనారోగ్యం నేపథ్యంలో బీజేపీ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేనని కార్యకర్తలకు మెసేజ్‌లో తెలిపారు.