Megastar Acharya Movie : వివాదంలో మెగాస్టార్ 'ఆచార్య'
Megastar Acharya Movie : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ
copy allegations on Megastar Acharya Movie
Megastar Acharya Movie : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.. ఈ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్మాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది 2021 సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర బృందం వెల్లడించింది. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా వలన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.
ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.. సినిమా మోషన్ పోస్టర్‌ని తన కథ నుంచి కాపీ కొట్టారంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ అనే యువ రచయిత ఆరోపిస్తున్నారు. 2006 సంవత్సరంలో తానూ పుణ్యభూమి అనే టైటిల్‌తో ఓ కథను రచయితల సంఘంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా వెల్లడించాడు. అయితే అందులో నుంచే ఆచార్య మోషన్ పోస్టర్‌లో ధర్మస్థలి అనే ఎపిసోడ్ తన స్క్రిప్ట్ నుంచి తీసుకునన్నారని అయన ఆరోపిస్తున్నారు. ఇక దీనిపైన ఆచార్య టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.. ఇక గతంలోనూ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు చిత్రం కూడా కాపీ అంటూ ఓ రచయిత ఆరోపణలు చేశాడు.