Coolie vs War 2: మిక్స్ డ్ టాక్ వచ్చిన దుమ్మురేపిన కూలీ, వార్ 2 కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వసూలు చేశాయంటే ?

Coolie vs War 2: మిక్స్ డ్ టాక్ వచ్చిన దుమ్మురేపిన కూలీ, వార్ 2 కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వసూలు చేశాయంటే ?

Update: 2025-08-18 12:30 GMT

Coolie vs War 2: మిక్స్ డ్ టాక్ వచ్చిన దుమ్మురేపిన కూలీ, వార్ 2 కలెక్షన్లు.. ఎన్ని కోట్లు వసూలు చేశాయంటే ?

Coolie vs War 2: సాధారణంగా ఒక సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద దాని కలెక్షన్లు తగ్గుతాయి. సినిమా వంద కోట్లు దాటడం కూడా కష్టమవుతుంది. కానీ, రజినీకాంత్ నటించిన కూలీ, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలకు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. ఇది రజినీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ల స్టార్‌డమ్ అని చెప్పవచ్చు.

కూలీ, వార్ 2 సినిమాలు ఆగస్టు 14న విడుదలయ్యాయి. ఆగస్టు 15న వచ్చిన సెలవును ఈ రెండు చిత్రాలు బాగా ఉపయోగించుకున్నాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రెండు సినిమాలు దేశీయంగా రూ.200 కోట్లకు చేరువలో కలెక్షన్లు సాధించాయి. కూలీ సినిమా నాలుగు రోజుల్లోనే భారీ కలెక్షన్లు సాధించింది. మొదటి రోజు రూ.65 కోట్లతో రికార్డు ఓపెనింగ్ అందుకున్న ఈ చిత్రం, రెండవ రోజు (శుక్రవారం) రూ.54.75 కోట్లు, మూడవ రోజు (శనివారం) రూ.39.5 కోట్లు, నాలుగవ రోజు (ఆదివారం) రూ.35 కోట్లు వసూలు చేసింది. మొత్తం నాలుగు రోజులకు గాను ఈ సినిమా రూ.194 కోట్ల భారీ కలెక్షన్లు సాధించింది.

కూలీ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజినీకాంత్ హీరోగా నటించగా, శ్రుతి హాసన్, షౌబిన్ షాహిర్, ఉపేంద్ర వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 కూడా ఆగస్టు 14న విడుదలైంది. ఈ చిత్రానికి కూడా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, యాక్షన్ ప్రియులకు బాగా నచ్చింది. మొత్తం నాలుగు రోజుల కలెక్షన్ రూ.173.60 కోట్లు వసూలు చేసింది.

ఈ రెండు సినిమాలు మిక్స్ డ్ టాక్‌తో కూడా ఇంత భారీ కలెక్షన్లు సాధించడం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలకు ఏ స్థాయి క్రేజ్ ఉందో అర్థమవుతుంది. ఈ రెండు సినిమాలకు ఇంకా వసూళ్ల పరంపర కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tags:    

Similar News