Corona Virus Effect: తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్‌..?

Corona Virus Effect: తెలంగాణలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే

Update: 2021-03-24 05:11 GMT

సినిమా థియేటర్స్ మూత

Corona Virus Effect: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ పడగవిప్పుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు సినిమా థియేటర్లు కూడా మూసివేయాలనే ప్రతిపాదనలు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపించింది. తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకవేళ థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు (50%) మాత్రమే అక్యూపెన్సీ నిబంధనలు విధించాలని సూచించింది. వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, ప్రేక్షకులు మాస్కులు ధరించకుండా పక్క పక్క సీట్లతో కూర్చోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

థియేటర్‌లో తలుపులన్నీ మూసివేసి ఏసీ వేస్తుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా హాళ్లు, జిమ్‌లు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సముదాయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో సారి థియేటర్లు మూత పడితే సినిరంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News