Chiranjeevi tweet on Plasma Donation: ప్లాస్మా దానం చేయండి.. ప్రాణాలు కాపాడండి: చిరంజీవి

Chiranjeevi tweet on Plasma Donation: ప్ర‌స్తుత మాన‌వ జాతి క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని అల్లాడుతున్న‌ది. ఈ సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి డాక్ట‌రు, పోలీసులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు త‌మ‌వంతు సాయాన్ని ప్ర‌క‌టిస్తున్నారు.

Update: 2020-07-25 11:07 GMT
chiranjeevi

Chiranjeevi tweet on Plasma Donation: ప్ర‌స్తుత మాన‌వ జాతి క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని అల్లాడుతున్న‌ది. ఈ సంక్షోభం నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి డాక్ట‌రు, పోలీసులు, రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు త‌మ‌వంతు సాయాన్ని ప్ర‌క‌టిస్తున్నారు. ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను , సూచ‌న‌లను సూచిస్తున్నారు.

ఈ సంద‌ర్భంలో ప్ర‌ముఖ సినీన‌టుడు చిరంజీవి ట్వీట్ ప్రాధాన్యం సంత‌రించుకుంది. ‌కరోనా మహమ్మారిని నియంత్రించ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌నీ, క‌రోనాను జ‌యించిన వారు ప్లాస్మా దానం చేయ‌డానికి ముందుకు రావాల‌ని చిరంజీవి విజ్ఞ‌ప్తి చేశారు. ప్లాస్మాను దానం చేసి ఇత‌రల ప్రాణాలను కాపాడాలని కోరారు.ఈమేరకు ఆయన శనివారం త‌న ట్విట్ట‌ర్ వేదికగా పిలుపు నిచ్చారు. యావత్ మాన‌వాళిని క‌రోనా క‌బ‌లిస్తున్నఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇంతకంటే గొప్ప మానవత్వం ఇంకేముంటుందని పేర్కొన్నారు. కరోనా వారియర్లు ఇప్పుడు ప్రాణ రక్షకులు కావాలని మెగా సార్ట్ అన్నారు. కరోనా నుంచి కోలుకొన్న ప్రతిఒక్కరూ ప్లాస్మా దానానికి ముందుకురావాలంటూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఇచ్చిన పిలుపుపై మెగాస్టార్ట్ ఇలా స్పందించారు. ఈ మేరకు సజ్జనార్‌ మాటలతో కూడిన ఓ వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు. 


Tags:    

Similar News