Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పోస్ట్.. మొదటి సినిమా రిలీజ్ అయ్యి 47 ఏళ్లు!

ఇప్పటికే 155 సినిమాలు పూర్తి చేసిన ఆయన తాజాగా సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ షేర్ చేశారు.

Update: 2025-09-22 08:51 GMT

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పోస్ట్.. మొదటి సినిమా రిలీజ్ అయ్యి 47 ఏళ్లు!

స్వయంకృషితో ఎదిగి, తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోల్లో ముందు వరుసలో నిలిచే పేరు మెగాస్టార్ చిరంజీవి. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికే 155 సినిమాలు పూర్తి చేసిన ఆయన తాజాగా సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ షేర్ చేశారు.

చిరంజీవి నటించిన మొదటి చిత్రం పునాది రాళ్లు. అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చినది ఆయన రెండో సినిమా ప్రాణం ఖరీదు. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరు, నరసింహ పాత్రలో నటించారు. రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ వంటి ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలై నేటికి (సెప్టెంబర్ 22) 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరు ఎమోషనల్ ట్వీట్ చేశారు.

“1978 సెప్టెంబర్ 22న ‘ప్రాణం ఖరీదు’ సినిమా ద్వారా కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే నేను ‘చిరంజీవి’గా మీకు పరిచయం అయ్యాను. అప్పటినుంచి నేటివరకు 47 ఏళ్లు పూర్తి కావడం చాలా గర్వకారణం. నాకు ప్రాణం పోసింది ఆ సినిమా, కానీ నన్ను అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా, చివరికి మెగాస్టార్‌గా నిలిపింది మీ అందరి ప్రేమ. ఈ 47 ఏళ్లలో నాకు వచ్చిన అవార్డులు, గౌరవాలు అన్నీ మీవే. ఈ అనుబంధం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలి” అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి.



ప్రస్తుతం ఆయన షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపుడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. అలాగే విశ్వంభరతో పాటు, శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలోనూ చిరంజీవి కొత్త సినిమాలు చేయనున్నారు.

Tags:    

Similar News