Chiranjeevi birhthday: 'మెగాస్టార్ బర్త్ డే' హడావుడి మొదలెట్టేశారుగా..!

Chiranjeevi birhthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోయే ర్యాంప్ సాంగ్ కి సంబంధించిన గ్లింప్స్‌ను ఆదివారం లాంచ్ చేశారు.

Update: 2020-08-16 16:23 GMT
Chiranjeevi birthday special song (image from youtube)

ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు పండగ రోజు. ఆరోజు ఆయన పుట్టినరోజు. ఇప్పటి నుంచే చిరు అభిమానులు సోషల్ మీడియాలో వేడుకలకు తెరలేపేశారు. సోషల్ మీడియాలో వేడుక అంటే తెలుసుగా.. ఇక అక్కడ మెగాస్టార్ పుట్టినరోజు రికార్డుల దుమ్ము దులపాలని మెగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

అందుకోసం కొంతమంది అభిమానులు చిరంజీవికి ప్రత్యెక ర్యాంప్ పాటను కానుకగా ఇవ్వాలని సిద్ధం అవుతున్నారు. 'మెగాస్టార్స్ మెగా ర్యాప్' పేరిట దీన్ని రూపొందిస్తున్నారు. ఆగస్టు 21న ఈ పాటను విడుదల చేస్తున్నారు. ఈ పాట గ్లింప్స్‌ను ఆదివారం లాంచ్ చేశారు.

నిఖిల్ కాన్సెప్ట్స్ సంస్థ రూపొందిస్తున్న ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్‌ అదిరిపోయే రేంజిలో ఉంది. దీనిని చూస్తె పాత ఏ రేంజిలో ఉండబోతోందో తెలుస్తోంది. మెగాస్టార్ పుట్టినరోజుకు అభిమానులు ఇచ్చే కానుక రికార్డుల మోత మోగించడం ఖాయంలా కనిపిస్తోంది. ఈ గ్లింప్స్‌లో కొంత మంది పిల్లలు చిరంజీవి మాస్క్‌లు వేసుకుని, 'జై చిరంజీవ' అని రాసున్న జెండాలతో పరుగులు పెడుతున్నారు. గ్లింప్స్ ఆఖరిలో చిరంజీవి మాస్క్ ధరించిన ఒక పిల్లాడు 'నమస్తే మాస్టారు' అని చిరంజీవి స్టైల్లో చెప్పడం సూపర్ గా ఉంది. ముఖ్యంగా గ్లింప్స్‌ క్వాలిటీ చాలా బావుంది. ఇందులో విజువల్స్, బీట్ చాలా బాగున్నాయి. ఫ్రీక్ మాసన్ సంగీతం సమకూర్చారు. స్కార్పియన్ ఆలపించారు. శివ చారి నిర్మించారు.  

Full View

Tags:    

Similar News