Chiranjeevi tweets on Sanjay Dutt: సంజయ్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలి.. సంజయ్ దత్ కు మెగాస్టార్ ఓదార్పు!

Chiranjeevi tweets on Sanjay Dutt: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన ఓదార్పు ప్రకటించారు. సంజయ్ దత్.. ఊపిరి తిత్తుల క్యాన్సర్‌తో త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

K V D Varma
Published on: 12 Aug 2020 10:38 PM IST
Chiranjeevi tweets on Sanjay Dutt: సంజయ్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలి.. సంజయ్ దత్ కు మెగాస్టార్ ఓదార్పు!
X
Chiranjeevi tweets on Sanjay Datt health situation

Chiranjeevi tweets on Sanjay Dutt: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా తన ఓదార్పు ప్రకటించారు. సంజయ్ దత్.. ఊపిరి తిత్తుల క్యాన్సర్‌తో త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అదేవిధంగా, క్యాన్సర్‌తో ఆయన ఎలాంటి భాదను అనుభవిస్తున్నారో చెప్పడం కష్టమన్నారు. జీవితంలో ఎన్నో రకాలులగా ఆటు పోట్లను తట్టుకొని నిలబడ్డ సంజయ్ దత్.. ఈ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్టు చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

కాగా, సంజయ్ దత్ శ్వాస సంబంధ వ్యాధితో ముంబై లోని లీలావతి ఆసుపత్రిలో మొన్న శనివారం చేరారు. అక్కడ ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దానిలో ఆయనకు నెగెటివ్ వచ్చింది. తరువాత జరిపిన పరీక్షల్లో సంజూ భాయ్ కు ఊపిరితిత్తుల కేన్సర్ ఉందని.. అది మూడో స్టేజ్ లో ఉందనీ ప్రకటించారు. దీనితో మరింత మెరుగైన చికిత్స కోసం సంజయ్ దత్ అమెరికా వెళ్ళాలని చూస్తున్నారు.

ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ కు చెందిన వారే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ లు చేస్తున్నారు.


K V D Varma

K V D Varma

Next Story