Sanjay Dutt: ఊపిరితిత్తుల కేన్సర్.. ఆసుపత్రిలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్!

Sanjay Dutt: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

S. Srikanth
Published on: 12 Aug 2020 9:44 AM IST
Sanjay Dutt: ఊపిరితిత్తుల కేన్సర్.. ఆసుపత్రిలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్!
X
Sanjay Dutt (File Photo)

Sanjay Dutt: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. సంజయ్ దత్‌కు శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పి రావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. అలాగే, ఛాతీలో సమస్య వచ్చింది. ఆయ‌న‌కు క‌రోనా పరీక్ష నిర్వహించగా ఆయనకు నెగిటివ్ వచ్చిన విషయం కుడా తెలిసిందే. అయినా సరే కొన్ని రోజుల పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాలని వైద్యులు సూచించడంతో ముంబైలోని లీలావతి హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తెసుకుని పరిస్థితి మెరుగుపడడంతో సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు.

సంజయ్ దత్ ఆసుపత్రిలో చేరినప్పుడు ఆయన ఆక్సిజన్ ఎవేల్స్ 90-92 మధ్య ఉండటంతో వైద్యులు ఆయనకు కొవిడ్ పరీక్ష పరిక్షలు నిర్వహించారు. అయితే ఆయనకు నెగెటివ్ గా నిర్దారణ అయింది. తరువాత చాతీ భాగంలో పరీక్షలు నిర్వహించారు వైద్యులు.. ఆ పరీక్షల్లో సంజయ్ దత్ స్టేజ్-4 ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్నట్టు నిర్ధారణ అయింది అని విధులు వెల్లడించారు. సంజయ్ దత్ సోమవారం మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం కోసం కొన్ని రోజులు నటనకు దూరంగా ఉండనున్నట్లు అయన ట్విట్టర్ ద్వార తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల ఆశీస్సులతో త్వరగా కోలుకుంటానని, త్వరలోనే తిరిగి వస్తానని ట్వీట్ చేసారు. సంజయ్ దత్ సినిమా లు చేస్తే.. ప్రస్తుతం అయన చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తోర్బాజ్, సడక్ 2, భుజ్, కేజీఎఫ్ 2 సినిమాల లో నటిస్తున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story