Sanjay Dutt Hospitalised: ఆస్వ‌స్థ‌త‌కు గురైన‌ సంజయ్ దత్

Sanjay Dutt Hospitalised: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరారు. సంజయ్ దత్‌కు శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పి రావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది.

Karampoori Rajesh
Updated on: 10 Aug 2020 12:29 PM IST
Sanjay Dutt Hospitalised: ఆస్వ‌స్థ‌త‌కు గురైన‌ సంజయ్ దత్
X
Sanjay Dutt hospitalised, tests negative for coronavirus

Sanjay Dutt Hospitalised: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్పత్రిలో చేరారు. సంజయ్ దత్‌కు శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పి రావడంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరినట్టు తెలిసింది. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. అలాగే, ఛాతీలో సమస్య వచ్చింది. ఆయ‌న‌కు క‌రోనా పరీక్ష నిర్వహించగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. అయినా సరే కొన్ని రోజుల పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాలని వైద్యులు సూచించిన‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెబుతున్నారు. నాన్ కోవిడ్ వార్డ్‌లో ఆయనకు ట్రీట్‌మెంట్ చేస్తున్నట్లుగా లీలావతి హాస్పటల్ వైద్య సిబ్బంది ప్రకటించినట్లు టాక్ వినిపిస్తుంది.

సంజయ్ దత్ నుంచి స్వాబ్ కలెక్ట్ చేసి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేసినట్టు లీలావతి ఆస్పత్రి వైద్యుడు తెలిపారు. నాన్ కోవిడ్ ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. సంజయ్ దత్‌కు మరికొన్ని పరీక్షలు చేయనున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ఇటీవల చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య బచ్చన్ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. సంజయ్ దత్ చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. తోర్బాజ్, సడక్ 2, భుజ్, కేజీఎఫ్ 2 సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story