Abhishek Bachchan Tests Negative : కరోనా నుంచి కోలుకున్న అభిషేక్ బచ్చన్

Abhishek Bachchan Tests Negative : బాలీవుడ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్

Krishna
Published on: 8 Aug 2020 4:39 PM IST
Abhishek Bachchan Tests Negative : కరోనా నుంచి కోలుకున్న అభిషేక్ బచ్చన్
X
Abhishek Bachchan (File photo)

Abhishek Bachchan Tests Negative : బాలీవుడ్ లో కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబం కోరోనా బారిన పడింది.. బిగ్ బీతో పాటుగా అయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక వీరంతా ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇందులో ఐశ్వర్యరాయ్, ఆరాధ్య త్వరగానే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక అమితాబ్ బచ్చన్ కూడా గత ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక తాజాగా అభిషేక్ బచ్చన్ కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

తాజాగా అయనకి చేసిన పరీక్షల్లో నెగిటివ్ అనే రిపోర్ట్ వచ్చింది. దీనితో అయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నట్లుగా వెల్లడించారు. దాదాపుగా 29 రోజుల పాటు అభిషేక్ బచ్చన్ చికిత్స పొందారు. ఇన్ని రోజులు తానూ కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరిని ధన్యవాదాలు తెలిపారు అభిషేక్.. మా ఫ్యామిలీ కరోనాను జయించేందుకు డాక్టర్లు చాలా హెల్ప్‌ చేశారు. వాళ్లు లేకుంటే మేం అంతా కోలుకునే వాళ్లం కాదు అని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఇక తమ అభిమాన నటుడు అభిషేక్ బచ్చన్ కరోనా నుంచి కోలుకోవడంతో అభిమానులు ఉపిరి పీల్చుకున్నారు.



Krishna

Krishna

Next Story