KGF' Adheera's First Look Released: అధీరా ఫస్ట్ లుక్ విడుదల

KGF Adheeras First Look Released: అధీరా ఫస్ట్ లుక్ విడుదల
x
KGF ADHEERA
Highlights

KGF' Adheera's First Look Released: దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రాల్లో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` కు ప్ర‌త్యేక స్థానం ఉంది. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించి, వ‌సూళ్ల ప‌రంగానూ చ‌రిత్ర సృష్టించింది.

KGF' Adheera's First Look Released: దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రాల్లో `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1` కు ప్ర‌త్యేక స్థానం ఉంది. క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించి, వ‌సూళ్ల ప‌రంగానూ చ‌రిత్ర సృష్టించింది. హీరో య‌ష్‌ను ఓవ‌ర్ నైట్‌లో ఇండియా స్థాయి స్టార్‌ని చేసింది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప‌రిస్థితీ అంతే. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా `కేజీఎఫ్ చాప్ట‌ర్‌2` రూపొందుతోంది. తొలి భాగానికి మించి రెండ‌వ భాగం మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో వుండ‌బోతున్నాయ‌ని చిత్ర‌సీమ‌లో భారీ ఉహాగానాలు ఉన్నాయి.

ఈ చిత్రంలో కీల‌క పాత్ర అయిన అధీరాగా బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ క‌నిపించ‌బోతున్నారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌ధాన మంత్రి ర‌మికా సేన్ పాత్ర‌లో బాలీవుడ్ హీరోయిన్ ర‌వీనాటాండ‌న్ క‌నిపించ‌నుంది. దాదాపు 80 శాతం సినిమా పూర్తింద‌ని.. క‌రోనా ఎఫెక్ట్‌తో చిత్ర‌బృందం షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఇదిలా వుంటే ఇందులో అధీరాగా న‌టిస్తున్న సంజ‌య్ లుక్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. నేడు సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఆయ‌న‌కు బ‌ర్త్‌డే కానుక‌గా అధీరా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. అక్టోబ‌ర్ 23న మూవీని రిలీజ్ చేయాల‌ని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. భూమిపై క్రూరత్వానికి పరాకాష్ఠ అని ఎవరినైనా అంటే అది అధీరా మాత్రమే అంటున్నాడు దర్శకుడు. విలన్ పాత్ర కోసం వెతుకుతున్న సమయంలో మొదట గుర్తుకు వచ్చింది సంజయ్ దత్ మాత్రమే అంటున్నాడు. కరోనావైరస్ సంక్షోభం వల్ల చిత్రీకరణ కొన్ని నెలలు వాయిదా పడినా.. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories