మోస్ట్ ట్రెండింగ్‌లో కేజీఎఫ్ 2 ఫ‌స్ట్ లుక్

మోస్ట్ ట్రెండింగ్‌లో కేజీఎఫ్ 2 ఫ‌స్ట్ లుక్
x
KGF2( File Photo)
Highlights

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన క‌న్నడ చిత్రం కేజీఎఫ్‌. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దాదాపుగా ఈ చిత్రం రూ.200 కోట్లు వసూళ్లు...

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన క‌న్నడ చిత్రం కేజీఎఫ్‌. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దాదాపుగా ఈ చిత్రం రూ.200 కోట్లు వసూళ్లు సాధించింది. కన్నడ చిత్ర సీమతో పాటు సౌత్‌ ఇండస్ట్రీ స్థాయిని మరో మెట్టు పైకెక్కించింది.అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 రాబోతుంది. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది.. కేజీఎఫ్‌ మొదటి భాగం (21 డిసెంబర్‌ 2018) విడుదలైన సరిగ్గా ఏడాదికి గుర్తుగా ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కేజీఎఫ్ కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ సీక్వెల్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఆ పోస్టర్ లో చిత్ర యూనిట్ 'సామ్రాజ్యం పునర్నిర్మితమవుతుంది' అని పేర్కొంది. ఇప్పుడు ఈ పోస్టర్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి రవి బాసుర్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, శరణ్‌ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని 2020 స‌మ్మర్‌లో విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories