logo

డైలాగ్ వస్తే చాలు 'కేజీయఫ్‌ 2' లో నటించచ్చు

డైలాగ్ వస్తే చాలు
Highlights

కన్నడ సినీ చరిత్రలో సంచలన విజయం సాధించిన హై బడ్జెట్ సినిమా 'కేజీయఫ్‌'. యువ హీరో యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌...

కన్నడ సినీ చరిత్రలో సంచలన విజయం సాధించిన హై బడ్జెట్ సినిమా 'కేజీయఫ్‌'. యువ హీరో యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా కన్నాడలోనే కాక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ అయిన 'కేజీయఫ్: చాప్టర్ 2' పనులు మొదలుపెటింది చిత్రబృందం. ఈ చిత్ర షూటింగ్ ఈమధ్యనే ప్రారంభించారు. అయితే 'కేజీయఫ్ 2' లో నటీనటులు కోసం ఆడిష‌న్స్‌ జరుగుతున్నాయి. ఇందులో పాల్గొన‌వ‌చ్చని చిత్రయూనిట్ ఓ పోస్టర్‌ ద్వారా తెలియచేశారు.

8 నుండి 16 సంవ‌త్సరాల వ‌య‌స్సున్న పిల్లలు, 25 సంవత్సరాల పైబ‌డిన పురుషులు కావాలని ఈ ప్రకటన సారాంశం. కానీ ఆడిష‌న్‌కి వ‌చ్చే ముందు కనీసం నిమిషం నిడివి ఉన్న ఏదైనా డైలాగ్‌ని నేర్చుకొని రావాల‌ని షరతు పెట్టారు. ఈ ఆడిషన్స్‌ బెంగళూరులోని జీఎమ్‌ రిజాయిజ్‌లో ఏప్రిల్‌ 26న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు జరగబోతోంది. ఆసక్తి ఉన్నవాళ్లు డైలాగ్ నేర్చుకుని వెళ్లచ్చు. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, ఉపేంద్ర లు 'కేజీయఫ్‌ 2' లో కనిపించబోతున్నారు.






లైవ్ టీవి


Share it
Top