KGF 2 : ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న లీక్ వీడియో

KGF 2 : ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్న లీక్ వీడియో
x
Highlights

సినీ పెద్దలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ షూటింగ్ సమయల్లోని కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వడం, సినిమా విడుదలయ్యాక పైరసీ రూపంలో సినిమా మొత్తం బయటకు...

సినీ పెద్దలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ షూటింగ్ సమయల్లోని కొన్ని సన్నివేశాలు లీక్ అవ్వడం, సినిమా విడుదలయ్యాక పైరసీ రూపంలో సినిమా మొత్తం బయటకు రావడం లాంటివాటిని అరికట్టలేకపోతున్నారు. ఇక పెద్ద హీరోల సినిమాలు నిర్మాణ దశలో ఉండగానే కొన్ని షూటింగ్ స్పాట్ లోని కొన్ని సన్నివేశాలు లీక్ అవుతున్నాయి. మెగాస్టార్ సైరా, రాజమౌళి ఆర్.ఆర్.అర్ మొదలగు చిత్రాలకి సంబంధించి కొన్ని బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి కేజీఎఫ్ పార్ట్ 2 కూడా చేరిపోయింది.

కేజీఎఫ్‌ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న కేజీఎఫ్‌2 షూటింగ్‌ సెట్‌కు సంబంధించిన ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా మైసూర్‌లోని గ్లోబుల్‌ ఎడ్యూశేషన్‌ సెంటర్‌లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు లీకయ్యాయి. యశ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ విలన్ గా నటిస్తున్నాడు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories