Riya chakravarti : సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు : రియాకు రక్షణ
Riya chakravarti : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే..
Riya chakravarti
Riya chakravarti : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో నటి రియా చక్రవర్తి ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. నిన్న( ఆగస్టు 28)న సీబీఐ ఆమెను పది గంటలకి పైగా విచారించింది. ఈ విచారణలో భాగంగా సీబీఐ పలు కీలకమైన అంశాలను రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సీబీఐ అధికారులు ఆమెను రెండోసారి కూడా విచారణ చేస్తున్నారు. ఇక మరోవైపు రియా చక్రవర్తికి మరియి ఆమె కుటుంబానికి ముప్పు ఉందని, ఆమెకి భద్రత కల్పించాలని సీబీఐ ముంబై పోలీసులకు లేఖ రాసింది. దీనితో ఆమె కుటుంబాన్ని రక్షించడానికి రాష్ట్ర పోలీసులు అధికారులను నియమించారు. రియా చక్రవర్తి ఇంటి వెలుపల ఒక పెద్ద మొబైల్ వ్యాన్, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మరియు మరో ఏడుగురు మగ కానిస్టేబుళ్లు రక్షణగా ఉన్నారు.
అటు రియా కూడా తన కుటుంబానికి రక్షణ కలిపించాలని గురువారం తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తానూ మాట్లాడుతూ.. తన ఇంట్లోకి వచ్చేందుకు రియా తండ్రి ప్రయత్నిస్తుంగా మీడియా అతన్ని చుట్టుముట్టిందని, కనీసం కరోనా పరిస్థితిల్లో ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా చాలా మంది తన తండ్రిని చుట్టుముట్టారని పేర్కొంది. తాము విచారణకి సహకరిస్తున్నామని కానీ మాకే ఎవ్వరు కూడా సహకరించడం లేదు అంటూ తన ఆవేదనని వ్యక్తం చేసింది.
ఇక జూన్ నెల 14న సుశాంత్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. కానీ ఇది ఆత్మహత్య కాదని హత్యేనని పలువురు భావిస్తున్నారు.