Sushant Singh Rajput case: సుశాంత్ కేసు : సీబీఐ విచారణలో రియా చక్రవర్తి!

Sushant Singh Rajput case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ జోరు పెంచింది.. ఇప్పటికే సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్‌

Krishna
Published on: 28 Aug 2020 11:45 AM IST
Sushant Singh Rajput case: సుశాంత్ కేసు : సీబీఐ విచారణలో రియా చక్రవర్తి!
X

Sushant Singh Rajput, Rhea Chakraborty

Sushant Singh Rajput case: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ జోరు పెంచింది.. ఇప్పటికే సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్‌ పితానీ, ఇంటి పనిమనిషిని విచారించిన సీబీఐ తాజాగా సుశాంత్ మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చ‌క్రవ‌ర్తికి స‌మ‌న్లు జారీ చేసింది. ఈ రోజు (శుక్రవారం) సీబీఐ విచారణకి హాజరు కావాలని నోటిసులు జారీ చేయడంతో ఆమె ఈరోజు ముంబైలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.. ఆమెతో పాటుగా సుశాంత్‌ స్నేహితుడు సిద్ధార్థ్‌ పితానీ కూడా మరోసారి ప్రశ్నించనుంది సీబీఐ.. సుశాంత్ ది ఆత్మహత్యా లేదా హత్య అన్న కోణంలో సీబీఐ తమ దర్యాప్తును కొనసాగిస్తుంది..

సుశాంత్ తండ్రి ఆరోపణలు :

రియా చక్రవర్తి పైన సుశాంత్ తండ్రి కేకే సింగ్ పలు ఆరోపణలు చేశారు.. తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన అయన రియా చక్రవర్తి తన కుమారుడిని చంపిన హంతకురాలని అంటూ కామెంట్స్ చేశారు.. చాలా రోజులుగా రియా చక్రవర్తి నా బిడ్డకు విషం ఇచ్చిందని, ఆమె ఒక హంతకురాలని, ఆమెను, ఆమె అనుచరులను వెంటనే అరెస్టు చేయాలి' ఆయన డిమాండ్ చేశారు. సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్ల నగదు నటి రియా చక్రవర్తి ఖాతాలోకి బదిలీ అయినట్లుగా సుశాంత్ తండ్రి గతంలో ఆరోపించారు. అటు సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్ వరస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే..

జూన్ 14 న సుశాంత్ మరణం :

జూన్ నెల 14న సుశాంత్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు.. అయితే అనే అతను ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. కానీ ఇది ఆత్మహత్య కాదని హత్యేనని పలువురు భావిస్తున్నారు.

Krishna

Krishna

Next Story