Kalyan Dev: మెగా హీరో సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ

Ariyana Glory: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్య్వూతో పేరు సంపాదించింది బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ.

Update: 2021-03-05 10:32 GMT

కళ్యాణ్ దేవ్ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Ariyana Glory: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్య్వూతో పేరు సంపాదించింది బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ. బిగ్ బాస్ తరువాత టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షీంచుకోవడానికి సిద్ధంగా ఉంది.

కాగా, అరియానా ఇప్పటికే యువ హీరో రాజ్ తరుణ్ ప్రాజెక్టును ఓకే చేసింది. ప్రస్తుతం ఈమె మెగా హీరో కళ్యాణ్ దేవ్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాను శ్రీధర్ సీపన డైరెక్ట్ చేయబోతున్నాడు. స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ తో రానున్న ఈ సినిమాలో హీరో కళ్యాణ్ దేవ్ సిస్టర్ గా అరియానా నటించబోతోందని టాక్ వినిపిస్తోంది.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహకారంతో పీపుల్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. బిగ్‌బాస్ తో వచ్చిన ఫేమ్ తో చాలా సంతోషంగా ఉందని, దానిని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది అరియానా. మెగా హీరో కళ్యాణ్ దేవ్ సినిమా షూటింగ్ మొదలైందని, ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నట్లు పేర్కొంది. బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత బ్యాక్-టు-బ్యాక్ ఆఫర్లతో చాలా బిజీగా ఉంది అరియానా.

Tags:    

Similar News