Bigg Boss Telugu 9: రాగానే మొదలుపెట్టేశారు.. మనీష్‌కి హరీశ్ వార్నింగ్
Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ ప్రతి సీజన్‌లోనూ సాధారణంగా కాస్త సమయం పట్టేది. కానీ ఈసారి మాత్రం మొదటి రోజే హీట్ స్టార్ట్ అయింది.
Bigg Boss Telugu 9: రాగానే మొదలుపెట్టేశారు.. మనీష్‌కి హరీశ్ వార్నింగ్
Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ ప్రతి సీజన్‌లోనూ సాధారణంగా కాస్త సమయం పట్టేది. కానీ ఈసారి మాత్రం మొదటి రోజే హీట్ స్టార్ట్ అయింది. ఆదివారం షో మొదలైన రోజు నుంచే నామినేషన్ల మూడ్, గొడవల వాతావరణం కనిపించింది.
హరీష్ – మనీష్ మధ్య తగువు
అగ్నిపరీక్ష పోటీలో గెలిచిన సామాన్యులు హరీష్, మనీష్. ఈ ఇద్దరి మధ్యే తొలిరోజు ఘర్షణ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్ టీం రిలీజ్ చేసింది.
పనుల కేటాయింపు
ఇంటి క్లీనింగ్, బాత్రూమ్ క్లీనింగ్, బట్టలు ఉతకడం వంటి బాధ్యతలు కొంతమంది కంటెస్టెంట్స్‌కి అప్పగించారు. అగ్నిపరీక్షలో గెలిచిన ఆరుగురు హౌస్ ఓనర్స్, మిగిలిన తొమ్మిది మంది టెనెంట్స్ అని నాగార్జున ప్రకటించారు. దీంతో మొత్తం 15 మంది పనుల గురించి చర్చించుకున్నారు.
తగువు ఎలా మొదలైంది?
పనుల కేటాయింపులో భాగంగా పవన్, రీతూ చౌదరికి గిన్నెలు శుభ్రం చేసే బాధ్యత ఇచ్చాడు. అలాగే వంట చేసే వారు కేవలం వంటపైనే ఫోకస్ చేయాలనే విషయంలో ప్రియ క్లారిటీ ఇచ్చింది. ఈ సమయంలో హరీష్, “సంజన ఖాళీగా ఉంది కాబట్టి క్లీనింగ్ చేస్తే బాగుంటుంది” అని సూచించాడు. దీనిపై మనీష్ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
హరీష్ కోపంగా స్పందిస్తూ, “మనీష్.. నీకు బ్యాడ్జ్ రాలేదు కదా.. నువ్వు మాట్లాడొద్దు” అని అన్నాడు. దానికి మనీష్ ప్రతివాదిస్తూ మాటల యుద్ధం మొదలైంది. మధ్యలో భరణి వచ్చి పరిస్థితిని కూల్ చేయడానికి ప్రయత్నించినా హరీష్ వెనక్కి తగ్గలేదు.
హరీష్ హెచ్చరిక
చివరగా హరీష్, “ఏదైనా అయితే నేను చూసుకుంటా.. అవసరం అయితే ఇంటి నుంచి బయటకెళ్లడానికి కూడా రెడీ” అని చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఈ విధంగా మొదటి రోజే హౌస్‌లో హాట్ వార్ జరగడం కొత్త సీజన్‌పై ఆసక్తి పెంచింది.