Bigg Boss 4 Telugu: నామినేషన్స్ రగడ..హౌస్ మేట్స్ మధ్య చిచ్చు!

Bigg Boss 4 Telugu: నోయల్ పెట్టిన మంట ఇంకా బిగ్ బాస్ లో కాగుతూనే ఉంది. అమ్మ రాజశేఖర్..అవినాష్ లు రగిలిపోతూనే ఉన్నారు. ఇక నామినేషన్లలో రచ్చ రచ్చ అయింది.

Update: 2020-11-03 03:58 GMT

Bigg Boss telugu season 4 highlights

బిగ్ బాస్ హౌస్ లో 58 వ రోజు చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఉదయం హుషారు పాటతో మొదలైన ఇంటిలో చివరికి వైలెన్స్ మిగిలింది. 57వ రోజు ఉదయం 8 గంటలకి ప్రభాస్ మిర్చి సినిమా పాటతో ఇంట్లో పార్టిసిపెంట్స్ అంతా హుషార్ గా బెడ్ మీద నుంచి దిగి డాన్సులతో రెచ్చిపోయారు. తన కెప్టన్సీలో వెంటనే పనిష్మెంట్ ఇంప్లిమెంట్ అవుతుందని ముందే చెప్పిన అరియాన నిద్రపోతున్న ఇంటి సభ్యులకు 15 నిమిషాలు టైం ఇచ్చి స్నానం చేయమని ఆర్డర్ వేస్తుంది. కళ్లు మూసుకున్న మహబూబ్ కు స్నానం చెయ్యమని ఆర్డర్ వేస్తుంది. ఐతే అలాంటి పనిష్మెంటే సొహైల్ కి ఇస్తుంది అరియాన. అక్కడ మొదలైంది రభస.

ఐతే అవినాష్, అఖిల్ కలిసి సొహైల్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. ఇక నోమినేట్ చేసే సభ్యులు టార్గెట్ చేసుకున్న వారిని ఎలా వివరించాలో బిగ్ బాస్ తెలిపారు. మామూలుగా కాకుండా కోడి గుడ్లను తలపై పగలగొట్టి చెప్పాలని అనడంతో ఎపిసోడ్ ఆసక్తిగా మారింది. ఏ కారణం చేత సభ్యుల్ని నామినేట్ చేయాలనుకుంటున్నారో వివరంగా చెప్పాలని బిగ్ బాగ్ పార్టిసిపెంట్స్ ని కోరారు. 

నోయల్‌ పెట్టిన చిచ్చు బిగ్‌బాస్‌ హౌస్‌లో బాగానే పనిచేసింది. నామినేషన్‌ డే (సోమవారం) రావడంతో హౌస్‌మేట్స్‌ అంతా నోయల్‌ వ్యాఖ్యలను బేస్‌ చేసుకొని నామినేషన్‌ చేసినట్లు కనబడింది. నామినేషన్ల సందర్భంగా అమ్మా రాజశేఖర్-అభిజిత్‌ల మధ్య పెద్ద గొడవ జరిగింది. 'నోయల్‌ గొడవ చేస్తే నువ్ ఎవడివి? కష్టపడి పైకి వచ్చినోడికి తెలుస్తోంది బాధ.. నీకేం తెలుసు?' అంటూ అభిజిత్‌పై అమ్మ రాజశేఖర్‌ ఫైర్‌ అయ్యాడు. కష్టం.. కష్టం.. ప్రతిసారీ కష్టమేనా? ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు. మీరొక్కరే కాదు.. అంటూ అమ్మా రాజశేఖర్‌పై అభిజిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్ ఏం కష్టపడుతున్నావ్.. చైర్‌లో కూర్చుని బాగా కష్టపడుతున్నావా?? అని మాస్టర్ అనడంతో.. నువ్ అరిస్తే ఎవడూ ఇక్కడ బయపడేటోడు లేడు అంటూ అభిజిత్ గట్టిగానే సమధానం ఇచ్చాడు. 

 అరియానా సోహైల్‌ని నామినేట్‌ చేయడంతో సోహైల్‌ కోపంతో ఊగిపోయాడు. ఇంకో గుడ్డు ఉంటే కూడా తీసుకొచ్చి కొట్టు.. హోలీ ఆడుకుందాం అంటూ అరియానాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఉదయం జరిగిన పనిష్మెంట్ గొడవ మనసులో ఉందేమో..సోహైల్ అరియానా మీద అరిచేశాడు. ఇక్కడ.. ఇక్కడి విషయాలు అక్కడ పెడుతున్నారంటూ సోహైల్‌ మోనాల్‌ని నామినేట్‌  చేశాడు.

నామినేట్ చేసే అవకాశం అవినాష్ కు వచ్చినప్పుడు ముందు అభిజీత్ తలపై గుడ్డు కొట్టాడు. తర్వాత హారికను నామినేట్ చేసాడు. తర్వాత మొనల్ ను టార్గెట్ చేస్తూ సొహైల్ నామినేట్ చేసాడు. రెండో నామినేట్ గా అభిజీత్ ను సెలెక్ట్ చేశాడు. నామినేట్ చేయడానికి అభిజీత్ వంతు వచ్చింది. అటు అవినాష్ ఇటు సొహైల్ తో ఎందుకు నామినేట్ చేస్తున్నాడో చెబుతున్నప్పుడు హౌస్ లో చాలా ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 

ఇవి 58వ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ఆసక్తికరమైన దృశ్యాలు. మరొక ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్లీ కలుద్దాం.

Tags:    

Similar News