బిగ్ బాస్ హైలైట్స్: ఫ్రెండ్ షిప్ డే సందడి..ఎలిమినేషన్ తో కంటతడి..

Update: 2019-08-05 01:24 GMT

సన్ డే ఫన్ డే అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ ఎపిసోడ్ 15 జాఫర్ ఎలిమినేషన్ తో విషాదంతో ముగిసింది. ఆదివారం ఫ్రెండ్ షిప్ డే కావడంతో వస్తూనే నాగార్జున అందరికీ విషెస్ చెప్పారు. తరువాత అందరికీ ఫ్రెండ్ షిప్ బాండ్ లు ఇచ్చి ఎవరికీ నచ్చిన ఫ్రెండ్ కి వారు కట్టుకోవాలని చెప్పాడు. శ్రీముఖి - బాబా భాస్కర్ కు, హిమజ - మహేష్ విట్టకు, జాఫర్ - రోహిణికి, బాబా భాస్కర్ - జాఫర్ కు, రవికృష్ణ - అలీకి, మహేష్ విట్ట - అశురెడ్డికి, వరుణ్ - రాహుల్ కి, వితికా షెరు - పునర్నవికి, శివజ్యోతి - హిమజకీ, తమన్నా - శ్రీముఖికి, పునర్నవి - వితికా షెరుకి, రోహిణి - తమన్నాకి, అలీ - రవికృష్ణకి, అశురెడ్డి - శివజ్యోతికీ, రాహుల్ - వరుణ్ సందేశ్ కూ బ్యాండ్ లు కట్టారు.

పునర్నవి సేఫ్..

ఈ సందడి అవుతుండగానే ఎలిమినేషన్ నుంచి పునర్నవి సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు నాగార్జున. ఇక హౌస్ లో జాఫర్, వరుణ్,వితికలు నామినేషన్ లో మిగిలారు.

ఇస్మార్ట్ సందడి..

ఇస్మార్ట్ హీరో రామ్, హీరోయిన్ నిధి అగర్వాల్ గెస్ట్ లుగా వచ్చారు. కొంత సేపు సందడి చేశారు. ఈ సందర్భంగా పదిహేను బ్యాడ్జీలు ఇచ్చి.. ఒక్కో సినిమా పేరు చెప్పి.. దానికి సూటయ్యే వారెవరనుకుంటే వారికి ఆ బ్యాడ్జీ పెట్టాలని సూచించారు. ఫన్నీగా ఈ గేమ్ సాగింది.

జాఫర్ ఎలిమినేషన్.. భోరున ఏడ్చిన శ్రీముఖి..

ఆదివారం ఉదయం నుంచీ సాంఘిక మాధ్యమాల్లో ప్రచారం అయినట్టుగానే, జర్నలిస్ట్ జాఫర్ ఈవారం ఎలిమినేట్ అయ్యారు. అయన బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ భావోద్వేగానికి గురయ్యారు. శ్రీముఖి అయితే.. భోరున ఏడ్చింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఇక బాబా భాస్కర్ కంటతడి పెట్టారు. అంతకు ముందు వితికా, జాఫర్ లు ఎలిమినేషన్స్ లో ఉన్నారు కాబట్టి ఎవరు హౌస్ లో ఉండాలనుకున్తున్నారంటూ నాగార్జున అడిగారు. దానికి జాఫర్ ఉండాలనుకున్తున్నట్టు ఏడుగురు చెప్పగా.. వితికను ఆరుగురు సమర్థించారు. అయితే, ప్రేక్షకుల ఓట్లు పరిగణన లోకి తీసుకుని జాఫర్ ఎలిమినేట్ అయ్యారని నాగార్జున ప్రకటించారు.

బయటకొచ్చిన వెంటనే ముఖాముఖి..

జర్నలిస్ట్ జాఫర్ ముఖాముఖి కార్యక్రమం చాలా పాప్యులర్. హౌస్ లోంచి బయటకు వచ్చిన వెంటనే.. హౌస్ మేట్స్ అందరినీ ముఖాముఖి ఫటా ఫట్ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూ ఇలా సాగింది..

జాఫర్‌ : మహేష్‌.. నిజంగా ముక్కోపా కాదా? ప్రశ్నకు మహేష్‌.. కాదు

జాఫర్‌ : బాబా భాస్కర్‌.. మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారా? ప్రశ్నకు బాబా భాస్కర్‌.. ఎవరు ఎలా అనుకుంటే అలా

జాఫర్‌ : శ్రీముఖికి హౌజ్‌లో వితికా ఫ్రెండా? శత్రువా? ప్రశ్నకు శ్రీముఖి.. ఫ్రెండ్‌

జాఫర్‌ : ఈ హౌస్‌లోకి ఎందుకు వచ్చావు? ప్రశ్నకు తమన్నా.. ట్రాన్స్‌జెండర్‌లో కూడా మంచోళ్లు ఉన్నారని చెప్పడానికి

జాఫర్‌ : తమన్నా అభిప్రాయంతో ఏకిభవిస్తున్నారా? ప్రశ్నకు అలీ.. అవును

జాఫర్‌ : మంచోళ్లు అని అనుకోవాలని ప్రయత్నిస్తున్నావా? ప్రశ్నకు రవి కృష్ణ.. నేను బయటెలా ఉన్నానో లోపల కూడా అలానే ఉన్నాను

జాఫర్‌ : అందరితో కలిసి ఉండటమే స్ట్రాటజీనా? ప్రశ్నకు రోహిణి.. కాదు

జాఫర్‌ : అందరితో మంచిగా ఉండటమే ప్లానా? ప్రశ్నకు అషూ రెడ్డి.. కాదు

జాఫర్‌ : ఫీమేల్‌ కంటెస్టెంట్లు హోల్‌ హార్టెడ్‌గా యాక్సెప్ట్‌ చేశారా? ప్రశ్నకు హిమజ.. మేల్‌ కంటెస్టెంట్లు కూడా యాక్సెప్ట్‌ చేశారు.

జాఫర్‌ : ఎమోషన్‌ డామినేషన్‌ చేస్తోందా? ప్రశ్నకు శివజ్యోతి.. ఫిజికల్లీ స్ట్రాంగ్‌గానే ఉంటాను..

జాఫర్‌ : అందరితో కలవడం లేదు.. గ్రూప్‌తోనే ఉంటున్నావు? ప్రశ్నకు పునర్నవి.. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు

జాఫర్‌ : ఓ గ్రూప్‌కు వరుణ్‌ నాయకత్వం వహిస్తున్నాడా? ప్రశ్నకు వితికా.. కాదు

జాఫర్‌ : నీకు కొంచెం ఫ్రస్ట్రేషన్‌ ఉందన్నావు.. నీపై హౌస్‌మేట్స్‌కు దురభిప్రాయం ఉందా? ప్రశ్నకు వరుణ్‌ సందేశ్‌.. లేదు

జాఫర్‌ : వరుణ్‌ గ్రూప్‌లో వైస్‌ కెప్టెన్‌? ప్రశ్నకు రాహుల్‌.. ఎవరికి ఎలా అనిపిస్తే అలా

ఇలా అందరూ ఫటా ఫట్ జవాబులిచ్చారు. చివరగా వెళ్ళిపోతూ.. జాఫర్ నాగార్జునతో హౌస్ లో అందరూ మంచివాళ్లే అనీ, వారికి ఇప్పటివరకూ గేమ్ పై ఒక స్ట్రాటజీ లేదనీ.. అలా అలా గైడిపేస్తున్నారని చెప్పారు. హౌస్ లో గ్రూపులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక ఈ గ్రూపులు ముందు ముందు ఎలా ఆట ఆడతాయో చూడాల్సి ఉంది.

ఎలా వుందంటే..

సరదాగా ప్రారంభమైన షో కొంత భావోద్వేగాలతో ముగిసింది. అయితే, మధ్యలో ఇస్మార్ట్ శంకర్ హీరో హీరోయిన్ల హడావుడి బాగానే ఎంటర్టైన్ చేసింది. ట్విస్ట్ లు లేకుండా అందరూ అనుకున్నట్టే జాఫర్ ఎలిమినేట్ కావడంతో.. పెద్ద మజా రాలేదు కానీ, జాఫర్ బయటకు పోతున్నప్పుడు హౌస్ మేట్స్ భావోద్వేగాలకు గురికావడంతో కొంత విషాదం ఏర్పడింది. ముఖ్యంగా శ్రీముఖి భోరున ఏడవడం అందర్నీ కదిలించింది. మొదటి వారం హేమ హౌస్ నుంచి వెల్లిపోయేటప్పుడు అంత భావోద్వేగాలు లేవు కానీ, జాఫర్ వెళుతున్నపుడు దాదాపు హౌస్ లో అందరూ కంట తడి పెట్టారు.

మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ అనుకున్నట్టుగానే.. సాగింది. ఫ్రెండ్ షిప్ డే సరదాలతో మొదలై.. జాఫర్ ముఖాముఖి తో విషాదంగా ముగిసింది.


Tags:    

Similar News