నాగ్ సూపర్ ఎంట్రీ.. తీన్మార్ సావిత్రి బిగ్ బాస్ గృహప్రవేశం తరువాత రెండో లక్కీ డిప్ తీయమని బిగ్ బాస్ చెప్పాడు. నాగ్ ఆపనీ చేశాడు. ఈ సారి రెడ్ కార్డ్‌తో సీరియల్ ఆర్టిస్ట్ రవికృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఇక మూడో సారి పింక్ కార్డ్‌తో డబ్ స్మాష్ స్టార్ అషూ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
ఇలా గెస్ట్ లు వచ్చారో లేదో వాళ్లకి బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రశ్నను అడగాలని, ప్రశ్నలతో పాటు ఆప్షన్స్ కూడా ఇచ్చి.. వారిచ్చే సమాధానాలతో వారిని ఓ అంచనా వేయమని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ విషయం ఆ ముగ్గురి మధ్యే ఉండాలని సూచించాడు.