Amitabh Bachchan Starts Shooting : కేబీసీ షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్
Amitabh Bachchan Starts Shooting : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో రికార్డు స్థాయిలో
Amitabh Bachchan starts shooting for Kaun Banega Crorepati
Amitabh Bachchan Starts Shooting : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు..అందులో భాగంగానే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా కరోనా బారిన పడ్డారు.. అయనతో పాటుగా అయన కుటుంబం కూడా కరోనా బారిన పడింది.. అదృష్టవశాత్తు అందరూ కరోనా నుంచి కోలుకున్నారు.
ఇక కరోనా నుంచి కోలుకున్న అమితాబ్ తిరిగి షూటింగుల్లో పాల్గొంటున్నారు. తాజాగా అయన 'కౌన్ బనేగా కరోర్‌పతి' 12వ సీజన్ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను అయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు... 'బ్యాక్ టు వర్క్.. కేబీసీ 12వ సీజన్ ప్రొడక్షన్ యూనిట్ పీపీఈ కిట్లు ధరించి షూటింగ్‌లో పాల్గొంది. ఇవి అద్భుత ఘడియలు.. కేబీసీ మొదలై 2020 సంవత్సరం నాటికి 20 ఏళ్లు పూర్తి' అని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ఇక బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమం 2000 సంవత్సరంలో మొదలైంది.. ఇప్పటివరకూ 11 సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం తన 12వ సీజన్ ని కొనసాగిస్తుంది.