Amitabh Bachchan: ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
Amitabh Bachchan: ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్
Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఏ అనారోగ్య సమస్య కారణంగా అమితాబ్ బచ్చన్‌ను ఆసుపత్రిలో చేర్చారనే విషయం తెలియరాలేదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కాలిలో ఏర్పడిన సమస్య కారణంగా అమితాబ్ ను ఆసుపత్రిలో చేర్చారు. సమస్య తీవ్రమైనది కాదని, స్వల్ప చికిత్స అనంతరం అమితాబ్ ను డిశ్చార్జ్ చేయనున్నారని సమాచారం.