Amit Shah to Meet Prabhas: హీరో ప్రభాస్‌తో భేటీ కానున్న అమిత్ షా

Amit Shah to Meet Prabhas: ప్రముఖ టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు.

Update: 2022-09-14 09:37 GMT

Amit Shah to Meet Prabhas: హీరో ప్రభాస్‌తో భేటీ కానున్న అమిత్ షా

Amit Shah to Meet Prabhas: ప్రముఖ టాలీవుడ్ హీరో ప్రభాస్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 16నే హైదరాబాద్‌కు వస్తున్న అమిత్ షా అదే రోజు కృష్ణంరాజు కుటుంబసభ్యులను కలిసి పరామర్శించనున్నారు. అదే రోజు సాయంత్రం హీరో ప్రభాస్‌తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇటీవలే మునుగోడు పర్యటన సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన అమిత్ షా జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ కాబోతుండడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Tags:    

Similar News